మాచర్ల ఎమ్మెల్యే భావమరిదినే చితకబాదిన రౌడీ మూకలు

గుంటూరు జిల్లాలో రౌడీలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వాలు ఏవైనా రౌడీ మూకలకు ముకుతాడు వేసేవారు కరవయ్యారు.

Update: 2024-11-03 09:42 GMT
గుంటూరు జిల్లాలో రౌడీలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వాలు ఏవైనా రౌడీ మూకలకు ముకుతాడు వేసేవారు కరవయ్యారు. రౌడీల ఆగడాలకు ఎటువంటి దిక్కూమొక్కూ లేని సామాన్య జనమే అనుకుంటుంటారు సాధారణంగా. కానీ సాక్షాత్తు ప్రజాప్రతినిధుల తమ్ముళ్లకు, వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా దిక్కులేకుండా పోయేలా పరిస్థితి దాపురించింది.
తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి భావమరిది కృష్ణారెడ్డిపై గుంటూరులో రౌడీ మూకలు రెచ్చిపోయాయి. బాకీ తీర్చమని అడిగినందుకు ఆయన్ను చితకబాదినట్టు తెలుస్తోంది. టెంపుల్ టన్ అపార్టుమెంట్‌ నిర్మాణం కోసం కృష్ణారెడ్డి దగ్గర రవీంద్రానగర్‌కు చెందిన బి. సుబ్రమణ్యేశ్వరరావు రూ.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు. చాలాకాలమైనా అప్పు తీర్చలేదు. దీంతో కృష్ణారెడ్డి, మాధవరావు అనే వ్యక్తితో కలిసి వెళ్లి ఆ డబ్బు తిరిగి ఇమ్మని సుబ్రమణ్యాన్ని అడిగారు. అక్కడ మాటామాటా పెరిగింది. ఈలోపు సుబ్రమణ్యేశ్వరరావు ఎవరెవరికో ఫోన్ చేశారు. వాళ్లందరూ వచ్చారు. సుబ్రమణ్యేశ్వరరావు కుమారుడు ఋషి ఉసికొలిపాడు. వచ్చిన వాళ్లందరూ కర్రలు చేతబట్టి కృష్ణారెడ్డిపై దాడి చేశారు. బాగా దెబ్బలు తగిలాయి. ఈలోపు కృష్ణారెడ్డి అనుచరులు కూడా అక్కడికి చేరుకున్నారు. వీధి పోరాటం తారాస్థాయికి చేరింది. ఇరువర్గాలకు గాయాలయ్యాయి.
దీంతో కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టాభిపురం పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కృష్ణారెడ్డి, మాధవరావు మీద దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాడి చేసిన వారిలో కొందరు పరారయ్యారు.
Tags:    

Similar News