కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ అవసరం

మార్క్సిస్టు ఆలోచనా పరుల వేదిక సదస్సులో 17 కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల‌ ఉద్ఘాటన.;

Update: 2025-02-23 15:26 GMT

కమ్యూనిస్టుల పునరేకీకరణకు నేడు ఎన్నో అవకాశాలు ఉన్నాయని 17 కమ్యూనిస్ట్ పార్టీల నేతలు అభిప్రాయ పడ్డారు. మార్కిస్ట్ ఆలోచనా పరుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని సివిల్ కోర్టుల సమీపంలో ఉన్న బుక్ ఫెస్టివల్ సొసైటీ లైబ్రరీ హాలులో జరిగిన సదస్సులో పలువురు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు నిండుతున్న సందర్భంగా ఉద్యమ పురోగమనం, ఆవస్యకత, అవకాశాలు, అవరోధాలు, అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అధ్యక్ష వర్గంగా హక్కుల ఉద్యమ జాతీయ నాయకులు చిగురుపాటి భాస్కరరావు, విశ్రాంత ఆచార్యులు నూర్ బాషా, న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్, జి శ్రీనివాసరావులు వ్యవహరించారు.

సామ్రాజ్యవాదం, దేశ కార్పొరేట్ శక్తులు, హిందూత్వ (హిందువులు వేరు, హిందూత్వం వేరు) శక్తుల కూటమి ఫాసిస్టు పరిపాలన పెట్రెగిపోతున్నదన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ ఆవశ్యకత ఉందని, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ మావో ఆలోచనా మౌలిక సూత్రాలను భారత దేశ ప్రస్తుత నిర్ధిష్ట పరిస్థితికి అన్వయించుకోవాలన్నారు. వర్గ పోరాటాలను, వాటికి అనుసంధానంగా కుల నిర్మూలన ఉద్యమాన్ని నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఆ క్రమంలో త్వరితంగా ఐక్య రాజకీయ కూటమిగా ఏర్పడి కార్మిక-కర్షక రాజ్యం ఏర్పాటు ను సాధించ వలసిన ఆవశ్యకత ఉందన్నారు. 1947 తర్వాత గడిచిన 75 సంవత్సరాల్లో ఏనాడూ లేనంతగా ఈ రోజు అవకాశాలు ఉన్నాయని, అన్ని వామపక్ష పార్టీల నాయకులు కార్మికవర్గ చైతన్యం ద్వారా సమాజంలో గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాలన్నారు.

Delete Edit

సదస్సులో మాట్లాడుతున్న హక్కుల ఉద్యమ జాతీయ నాయకులు భాస్కరరావు

వేదిక కన్వీనర్, హక్కుల ఉద్యమ జాతీయ నాయకులు చిగురుపాటి భాస్కరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న చీలికలు ఆసరా చేసుకుని ఫాసిస్టు మతోన్మాద కార్పొరేట్ శక్తులు, దోపిడీ దారులు దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నారన్నారు. నిరుద్యోగం పెరిగింది. దళితులు, మైనారిటీల హక్కుల్ని కాలరాస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్ని కార్పొరేట్ పరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం జరిగిన 1925 లోనే ఆరెస్సెస్ కూడా ఏర్పడిందని అన్నారు. కమ్యూనిస్టులు అందరూ ఒకే వేదిక మీదకు వచ్చి ఐక్య ఉద్యమాలు సాగించాలని పిలుపు నిచ్చారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో పోరాట చరిత్ర ఉంది, 1964లో నాటి పరిస్థితుల్లో చీలికకు కొన్ని కారణాలు ఉండవచ్చు. వాటికి నేడు ప్రాముఖ్యం ఇస్తే కాలం వృధా అవుతుంది. వర్తమానం కమ్యూనిస్టు ఉద్యమ ఆవశ్యకతను మన ముందుకు తెచ్చింది. దీన్ని విశాల దృక్పథంతో మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Delete Edit

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో కార్మిక, రైతాంగ పోరాటాలతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద విశాఖ ఉక్కు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అనేక సమస్యల మీద తొమ్మిది వామపక్ష పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయని, ఆ పోరాట క్రమంలో కమ్యూనిస్టులు ఒక్కటి అవుతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

సిపిఐ(ఎంఎల్) పార్టీల నాయకులు కె జీ రామచందర్, నరసింహస్వామి, పి ప్రసాద్, ఎమ్ పి రామ్ దేవ్, మన్నవ హరిప్రసాద్, పాడిబండ్ల కోటేశ్వరరావు, విరసం కార్యదర్శి పినాకపాణి, ఎం సిపిఐ (యూ) నాయకులు కే నాగభూషణం, వెంకటరెడ్డి, అమర్ నాథ్ తదితరులు మాట్లాడుతూ ఆయా పార్టీల వైఖరులను వివరించారు. మార్క్స్, లెనిన్, మావో, అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకు సాగాలన్నారు.

Tags:    

Similar News