నామినేషన్ల వేళ వీరంగం వేశారో..

ఆంధ్రలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో ఈ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి.

Update: 2024-04-18 06:33 GMT

ఆంధ్రలో మరికాసేపట్లోనే నామినేషన్‌ల స్వీకరణ ఘట్టం ప్రారంభం కానుంది. అందుకోసం నేతలు సన్నద్ధం అవుతున్నారు. భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు వేయడానికి సన్నద్ధం అవుతున్నారు. అనుచరులతో కలిసి నామినేషన్ కేంద్రాలకు బయలుదేరుతున్నారు. అయితే నామినేషన్ వేయాలని అనుకునే వారంతా కొన్ని నిబంధనలు తెలుసుకోవాలి. నామినేషన్ కేంద్రాల్లో అధికారులు ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారు. అవి నామినేషన్ సమయంలో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఐదుగురిని మాత్రమే కేంద్రంలోనికి అనుమతిస్తారు. ఈ క్రమంలోనే నామినేషన్ దాఖలు చేసే అఫిడవిట్‌లో సదరు అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను కూడా సమగ్రంగా తెలియజేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఏ ఒక్క నిబంధనలు అతిక్రమిస్తే సదరు అభ్యర్థిపై అనర్హత వేటు కూడా వేసే అవకాశం ఉందని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

నాలుగో విడదల ఎన్నికలు

భారత్‌దేశం 2024 లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో జరగనున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు నాల్గవ విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను జాతీయ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 శాసన సభ స్థానాలతో పాటు తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల కూడా జరగనుంది. ఈ నాలుగో విడదత మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ ఉన్నాయి. ఈరోజు 11 గంటల నుంచి ఈ పది రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైపోయింది.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో మే 13న పోలింగ్ జరుపుకోనున్న రాష్ట్రాల్లో పలు అంశాలపై నేటి నుంచి నిషేధం అమల్లోకి రానుంది. వాటిలో మొదటి నేటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఈ రాష్ట్రాల్లో ఒపీనియన్ పోల్స్, ప్రీపోల్, సర్వే వివరాలను వెల్లడించకూడదు.

ఇంతకీ ఆ నిబంధనలేంటంటే..

ఎవరైనా నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ఆగాలి.

నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు మరో ఐదుగురికి మాత్రమే కేంద్రం లోపలికి అనుమతి ఉంటుంది.

నామినేషన్ కేంద్ర పరిసరాల్లోకి మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఆ వేళల్లోనే రిటర్నింగ్ అధికారి నామినేషన్లు స్వీకరిస్తారు.

అభ్యర్థిని బలపరిచే వ్యక్తి తప్పకుండా అదే నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలి.

గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి బలపరిచే వ్యక్తి ఒకరు ఉండాలి. అదే స్వతంత్ర అభ్యర్థికి అయితే పదిమంది ఉండాలి.

ఒక్కో అభ్యర్థి కనీసం మూడు నామినేషన్లు వేయొచ్చు.

ప్రతి అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ కింద జనరల్ అభ్యర్థి అయితే రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.5వేల చెల్లించాలి.

ఒకవేళ సదరు అభ్యర్థికి నేర చరిత్ర ఉంటే సదరు వివరాలను తప్పనిసరిగా నామినేషన్‌లో పొందుపరచాలి. అందుకోసం ఫారం-26లో అఫిడవిట్‌ను జతచేయాలి. దాంతో పాటుగా మూడు సార్లు దినపత్రికలు, చానళ్లకు సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు ప్రకటనలు ఇవ్వాలి.

నామినేషన్ వేసినప్పటి నుంచి పోలింగ్ తేదీ లోపు అభ్యర్థి తన నేరచరిత్రను మూడు సార్లు తన చరిత్రను ప్రజలకు వెల్లడించాల్సి ఉంటుంది.

ప్రతి అభ్యర్థి ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలి.

నామినేషన్ అందజేయడానికి వచ్చినప్పటి నుంచి సదరు అభ్యర్థి ప్రచార ఖర్చును అధికారులు లెక్కిస్తారు.

ర్యాలీలు, సభలకు విధిగా అనుమతులు తీసుకోవాలి. అనుమతుల కోసం సువిధ యాప్‌ను వినియోగించుకోవచ్చు.

ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలి.

Tags:    

Similar News