శాంతిహోమంతో శ్రీవారి ఆలయం శుద్ధి..

శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంతో జరిగిన అపచార దోషనివారణకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

Update: 2024-09-23 07:15 GMT

తిరుమల ఆలయంలో సోమవారం టీటీడీ శాంతి హోమం నిర్వహించింది. ఉదయం 6 గంటలకు ఈ క్రతువు ఆగమోక్తంగా ప్రారంభమైంది. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన అపచార, దోష నివారణ కోసం వేద పండితులు ఆగమ శాస్త్ర సలహాదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ శాస్త్ర సలహా మండలి సభంయుడు మోహనరంగా చార్యులు, వేదపండితులతో కలిసి టీటీడీ ఈఓ జే. శ్యామలరావు, సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.


తిరుమల శ్రీవారి ఆలయ అంతర్భాగంలో బంగారుబావి పక్కన ఏర్పాటుచేసిన మూడు హోమగుండాల్లో శాంతిహోమం నిర్వహించారు. శాంతి హోమంలో భాగంగా వాస్తు హోమం, పంచగవ్య ప్రోక్షణ, గోవు పాలు, పెరుగు, పంచితంతో ఆరాధన చేశారు.

ఈ శాంతి హోమంలో 8 మంది అర్చకులు, ఆగమ సలహాదారులు, టీటీడీ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొదట నివేదించే లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యి లో కల్తీ జరిగిన కారణంగా అపచారం జరిగినట్లు టీటీడీ యంత్రాంగం నిర్ధారించింది. 

"లడ్డు ప్రసాదంలో గొడ్డు, పంది కొవ్వుతోపాటు చేప నూనె కూడా కలిసింది" అనే ఆరోపణల కారణంగా, ఆ నివేదికలను కూడా టీటీడీ బహిర్గతం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం ఉలిక్కిపడింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కలవరానికి గురయ్యారు. దీంతో భక్తుల మానసిక, ఆధ్యాత్మికతను కాపాడే దిశగా శ్రీవారి ఆలయాన్ని కూడా హోమంతో శుద్ధి చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీటీడీ ఈవో శ్యామల రావు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో హోమాధికారు పూర్తయిన తర్వాత వేద పండితులు ఆలయంతో పాటు ఆలయం వెలుపల మాడవీధులు, సమీపంలోని ఉప ఆలయాలు పవిత్ర ప్రదేశాలన్నీ పంచగవ్యాలతో వెదజల్లుతూ ప్రోక్షణ నిర్వహించారు. ద్వారా తిరుమల ప్రధానంగా శ్రీవారి ఆలయంలో జరిగిన అపచారం దోష నివారణ జరిగినట్లు చెప్పారు.

తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తిరుమల లో పవిత్రోత్సవాల నిర్వహించారు.

"శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాలు, ఉదయాత్పుర సేవలలో తెలిసి, తెలియకో జరిగిన తప్పిదాలను మన్నించాలి"అని శ్రీవారిని ప్రార్థిస్తూ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు ఆగష్టు 15  నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ద్వారా ఇప్పటికే "శ్రీవారి ఆలయంలో దోష నివారణ జరిగింది" అని టీటీడీ ఈవో జే శ్యామల రావు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోమాదికాలు నిర్వహించిన తర్వాత మొదట స్వామివారికి నివేదించడానికి తయారు చేసే లడ్డు పోటులో పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించారు. ఆ తర్వాత ఆలయం లోని సంపంగి ప్రాకారం చుట్టూ, అంతరాలయాలు, మాడవీధులు, గొల్ల మండపం, వరాహ స్వామి ఆలయం, బేడి ఆంజనేయ స్వామి వారు కొలువైన అఖిలాండం తోపాటు పంచగవ్యాలతో ప్రోక్షణ నిర్వహించారు.
శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించడానికి మాత్రమే ఆగ పండితులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడే దిశగా తిరుమలలో మహా శాంతి హోమం నిర్వహించడం ద్వారా దోష నివారణ జరిగినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.


Tags:    

Similar News