గుడివాడలో రూ. కోట్లాది విలువైన ఆస్తి బుగ్గిపాలు
కృష్ణా జిల్లా గుడివాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
By : The Federal
Update: 2025-12-14 04:30 GMT
కృష్ణా జిల్లా గుడివాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడివాడలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం( డిసెంబర్ 14వ తేదీ) ఉదయం ఈ సంఘటన జరిగింది. కోట్లాది రూపాయల నష్టం జరిగినట్టు ప్రాధమిక అంచనా. నెహ్రూ చౌక్ సెంటర్‌లోని అద్దేపల్లి కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి.
తొలుత సెల్‌ఫోన్ దుకాణంలో వచ్చిన మంటలు ఆ తర్వాత మిగతా షాపులకు అంటుకున్నాయి. ఇదే కాంప్లెక్స్‌లో జూనియర్ కళాశాల, ఎస్‌బీఐ శాఖలు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనాస్థలాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. ప్రమాదంతో సుమారు రూ.కోటి ఆస్తి నష్టం జరిగినట్లు జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి ఆంజనేయులు తెలిపారు. నష్టాన్ని అంచనా వేస్తున్నారు.