జగన్‌ను కలిసిన ప్రేమ్‌కుమార్‌ భార్య

వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తోందని వాపోయారు.;

By :  Admin
Update: 2024-12-12 12:50 GMT

గుంటూరుకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ కొరిటిపాటి ప్రేమ్‌ కుమార్‌ భార్య సౌజన్య, ఆయన కుటుంబ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి,వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ప్రేమ్‌కుమార్‌ను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారని, వారి నుంచి ప్రేమ్‌కుమార్‌ను కాపాడాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపైన స్పందించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రేమ్‌కుమార్‌ బెయిల్‌ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందజేయాలని వైఎస్సార్‌సీపీ లీగల్‌ టీమ్‌కు సూచించారు. ప్రేమ్‌కుమార్‌కు వైఎస్‌ఆర్‌సీపీ పూర్తి అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున పోలీసులు తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించారని, ప్రేమ్‌కుమార్‌ను బలవంతంగా తీసుకెళ్లారని జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రేమ్‌కుమార్‌కు, ప్రేమ్‌కుమార్‌ కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయన చట్టపరంగా సోషల్‌ మీడియా అక్రమ కేసులను ఎదుర్కొంటుందని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడుతో కలిసి బాధితులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

Tags:    

Similar News