అమెజాన్‌పై పవన్ కల్యాణ్ అసంతృప్తి
గిఫ్ట్ కార్టు సమస్యను పరిష్కరించేందుకు ఈజీ మార్గాన్ని ఎంచుకోవాలని అమెజాన్‌ను కోరారు.;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రముఖ ఈ–కామర్స్ పోర్టల్ అమెజాన్‌పై స్పందించారు. గిఫ్ట్ కార్డులకు సంబంధించిన అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెజాన్ గిఫ్ట్ కార్డుల్లో డబ్బును జమ చేయడం సులువైన పనే అని, డబ్బులు జమ చేసే సమయంలో ఎటువంటి సమస్యలు ఉండవని, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వివరాలు కానీ యుపీఐ వివరాలు కానీ పొందుపరిస్తే సరిపోతుందని, కానీ జమ చేసిన డబ్బును కాలపరిమితి పూర్తి అయిన గిఫ్ట్ కార్డుల నుంచి వెనక్కి తీసుకోవడమే అసలు సమస్యగా మారిందని పేర్కొన్నారు.
దీని కోసం వినియోగదారులు అమెజాన్ కస్టమర్‌ను సంప్రదించడం, తర్వాత వారి వివరాలను తెలియజేడంతో పాటుగా ఎంతో సంక్లిష్టతరమైన, సుదీర్ఘమైన ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే కాలపరిమితి ముగిసిన కార్టులోని డబ్బు వినియోగదారుల ఖాతాలోకి జమకావడం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని, ఇలా కాలపరిమితి ముగిసిన గిఫ్ట్ కార్డుల్లో నుంచి డబ్బును వినియోగదారులు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రయను సులభతరంగాను, సరళంగాను ఎందుకు చేయకూడదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గిఫ్ట్ కార్డులో వినియోగదారులు ఉపయోగించుకోకుండా మిగిలి పోయిన బ్యాలెన్స్ మొత్తం ఆటోమేటిగ్గా వినియోగదారుల ఖాతాలోకి కానీ, అమెజాన్‌కు లింక్ అయి ఉన్న బ్యాంకుల ఖాతాల్లోకి కానీ బదిలీ అయితే బాగుంటుందని కదా.. ఆలాంటి ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటే వినియోగదారుల సమయం ఆదా అవడమే కాకుండా యూజర్లు తమ గిఫ్ట్ కార్డుల్లోని డబ్బును కోల్పోకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా.. దీనిపై ఎందుకు ఆలోచలు చేయడం లేదని అమెజాన్‌ను ప్రశ్నించారు.
కోట్లాది మంది వినియోగదారులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈజీ మార్గాన్ని అన్వేషించి గిఫ్ట్ కార్డుల సమస్యలను పరిష్కరించాలని పవన్ కల్యాణ్ అమెజాన్‌ను కోరుకుంటున్నట్లు పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. ఈ పోస్టును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను, ఆర్బిఐను ట్యాగ్ చేశారు.