జనసేన పార్టీకి పీఏసీ చైర్మన్‌ పదవి ?

ఏపీలో పీఏసీ చైర్మన్‌ ఎన్నికలు హాట్‌ టాపిక్‌గా మారాయి. వైఎస్‌ఆర్‌సీపీకి అవకాశం లేదనే టాక్‌ నడుస్తోంది.

By :  Admin
Update: 2024-11-21 12:54 GMT

పీఏసీ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జనసేన పార్టీ నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పీఏసీ సభ్యులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈయనతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్‌ రాజగోపాల్, ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎస్‌కోటా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ నుంచి విష్ణుకుమార్‌ రాజు నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా పీఏసీ సభ్యులుగా పోటీ పడుతున్నారు.

పులపర్తి రామాంజనేయులు పేరును పీఏసీ చైర్మన్‌గా జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపాదించారు. సభ్యుల ఎన్నికల పూర్తి అయిన తర్వాత రామాంజనేయులును చైర్మన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పటి వరకు పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు ఇస్తున్నారు. ప్రస్తుతం శాసన సభలో ప్రతిపక్ష పార్టీ ఉన్నా, అధికార కూటమి వైఎస్‌ఆర్‌సీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించక పోవడం వల్ల వైఎస్‌ఆర్‌సీపీకి పీఏసీ చైర్మన్‌ పదవి దక్కే అవకాశల్లేవనే చర్చ సాగుతోంది. పీఏసీ చైర్మన్‌ కావాలంటే ముందుగా కమిటీ సభ్యుడుగా ఎన్నిక కావలిసి ఉంటుంది. సభ్యుడిని ఎన్నుకునేందుకు కనీసం 20 ఓట్లు కావాలని, అయితే వైఎస్‌ఆర్‌సీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నందు వల్ల పీఏసీ సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశం లేదని, ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోంది. అయితే పీఏసీ సభ్యుడిగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News