గతంలో నన్నెవ్వరూ ఓడించలేదు..నేనే ఓడిపోయాను
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకు గుక్క తిప్పుకోలేని సమస్యలు ఉన్నాయి.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఓటమి గురించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాల గురించి వ్యాఖ్యలు చేశారు. 2004 ఎన్నికల్లో కానీ, తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో కానీ తనను ఎవ్వరూ ఓడించ లేదని, తానే ఓడిపోయానని వెల్లడించారు. తాను తీసుకున్న నిర్ణయాలతో పాటు తానే ఓటమి కారణమని పేర్కొన్నారు. పని చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో పరుగెత్తానని, పని అనేది తనకు ఒక వ్యసనంలా మారిపోయిందన్నారు. అది సాధించాలని, ఇది సాధించాలని పరుగెత్తాను. దీంతో కొద్దిగా ఎమ్మెల్యేలకు సంబంధించినది కానీ, పార్టీకి సంబందించినది కానీ, పనులు చేయడంలో కొద్దిగా అశ్రద్ధ జరిగింది. పని ఒత్తిడి ఎక్కువుగా ఉండటం వల్ల అవి సరిగా చేయలేక పోయాను. అవి కూడా చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.