బెంగళూరుకు చేరిన నాయక్ భౌతికకాయం

కాశ్మీర్ యుద్ధభూమిలో అమరుడైన మురళీనాయక్ పార్దీవదేహం బెంగళూరు నుంచి కల్లి తండాకు తీసుకువెళుతున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో పలువురు ఆయనకు నివాళులు అర్పించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-10 11:20 GMT
బెంగళూరు విమానాశ్రంలో మురళీనాయక్ కు సెల్యూట్ చేస్తున్న మంత్రులు, సైనికులు

ఆపరేషన్ సింధూర్ లో పాక్ సైన్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన వీరజవాన్ ఎం. మురళీనాయక్ శవపేటిక బెంగళూరు విమానాశ్రయానికి చేరింది. కాశ్మీర్ నుంచి విమానంలో బెంగళూరుకు వచ్చిన శవపేటికను కర్ణాటక పోలీసులు, మిలిటరీ అధికారులు రిసీవ్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం సుమారు 3.30 గంటలకు తీసుకుని వచ్చారు. అక్కడే ఓ బల్లపై పేటికను ఉంచారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో చేరిన అనంతపురం జిల్లా వాసులు, స్థానిక ప్రజలు, విమానాశ్రయ సిబ్బంది కూడా ఆశ్రునయనాలతో నివాళులర్పించారు. సైనికలాంఛనాలతో గౌరవవందనం సమర్పించారు. ఆ తరువా మంత్రి ఎస్. సవితమ్మ, మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత, ఏపీ అధికారులతో మిలిటరీ అధికారులు మాట్లాడారు.


బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి మురళీనాయక్ పార్ధివదేహం శవపేటికను మిలిటరీ జవాన్లు మోసుకుని వచ్చారు. 


కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విమానాశ్రయం వద్దే పుష్పగుచ్చాలు ఉంచి, సెల్యూట్ చేశారు. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో శ్రీసత్యసాయి జిల్లా మంత్రి, పెనుగొండ ఎమ్మెల్యే ఎస్. సవితమ్మ మొదట పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఆమె తోపాటు కేంద్ర మంత్రులు జీ. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తదితరులు కూడా పుష్పగుచ్చాలు ఉంచి వందనం చేశారు. ఆ తరువాత అక్కడి పోలీస్, మిలిటరీ అధికారులు గౌరవవందనం సమర్పించారు.


రోడ్డుమార్గంలో కల్లి తండాకు..

మురళీనాయక్ పార్ధివదేహం ఉన్న పేటికను ఆర్మీ వాహనంలో ఉంచారు. అక్కడి నుంచి బాధ్యతలు అప్పగించిన సైనికులు, కర్ణాటక పోలీసులు వాహనంలో బయలుదేరారు. మురళీనాయక్ శవపేటిక ఉంచిన వాహనంతో పాటు రాష్ట్ర మంత్రులు సవితమ్మ, సత్యకుమార్, కేంద్ర మంత్రులు జీ. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఉన్నారు. సాయంత్రం 5.30 గంటలకు గోరంట్ల కూడలికి మురళీనాయక్ పార్ధివదేహం పేటిక చేరుతుంది. అక్కడి నాలుగు కిలోమీటర్ల దూరం యాత్ర సాగుతుంది. అనంతరం మురళీనాయక్ ఇంటివద్దకు శవపేటికను చేర్చడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.
Tags:    

Similar News