జోగి రమేష్ ‘బిసి కార్డు’ను ఖండించిన కాంగ్రెస్ నేత శివాజీ
‘నకిలీ మద్యం కేసు చుట్టుకున్నాక బిసి అని గుర్తొచ్చిందా?’
సానుభూతి కోసం నన్ను టార్గెట్ చేశారని వాపోవడం వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రి జోగి రమేష్ వాపోవడం పట్ల ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శాసన సభ్యుడిగా, మంత్రిగా ఆవినీతి, అక్రమాలకు తెర లేపి ప్రభుత్వ, ప్రజాదనాన్ని లూటి చేసి ఇపుడు సుద్దపూస లెక్క నీతి వ్యాఖ్యలు చెయ్యటం వింతగా ఉందని, అది ఆయనకే చెల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అదే విధంగా తాను వెనకబడిన కులానికి చెందిన నాయకుడయినందునే తనని టార్గెట్ చేశారని రమేష్ చేస్తున్నవాదనని కూడా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ బిసి నేత కూడా అయిన శివాజీ అన్నారు.
రాష్ట్రాన్ని కుదిపేసిన నకిలీ మద్యం తయారీ కేసులో వైఎస్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన తమ్ముడు జోగి రామును ఎక్సైజ్, సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి ఇంటికి ఎక్సైజ్, సిట్ అధికారుల బృందం ఆదివారం తెల్లవారుఝామున 5.30 గంటలకు వెళ్లింది. కొంత డ్రామాతర్వాత అరెస్టు జరిగింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసు కస్టడీలో ఇచ్చిన కీలక వాంగ్మూలం (స్టేట్‌మెంట్) ఆధారంగానే రమేష్ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. జనార్దనరావు తన విచారణలో, జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేశానని, అందుకు రమేష్ ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారని అధికారులకు వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగానే సిట్ అధికారులు అరెస్ట్‌కు చేశారు.
దీని మీద కాంగ్రెస్ సీనియర్ నేత శివాజీ మాట్లాడుతూ నిండితుడు కోరిన విధముగా దర్యాప్తు జరగదని వ్యాఖ్యానించారు. ‘తాను నేరం చేయలేదని వాపోవడ. గుళ్లో ప్రమాణాలచేయడం అరెస్టు కాకుండా నిరోధించలేదు. అద్దేపల్లి జనార్దణరావు కి నీ రూట్స్ ఎంత బలముగా ఉన్నాయో అధికారులకు చెప్పినాడు. దాని ఆధారముగానే అదుపులోకి తీసుకోవటం జరిగింది,’ అని శివాజీ వ్యాఖ్యానించారు.
తాను బీసీ కాబట్టే కాబట్టే టార్గెట్ చేస్తున్నారు అన్ని సానుభూతి మాటలు మాట్లాడవద్దని ఆయన జోగిరేమేష్ హితవు చేస్తూ గతంలో మంత్రులుగా చేసిన వారి మీద నీలాగా ఆరోపణలు రాలేదని కూడా శివాజీ అన్నారు.
అదే విధంగా సిట్ దర్యాప్తును విస్తృతం చేయాలని కూడా శివాజీ కోరారు.,
“జనార్దనరావు ఆరోపణలు మీద జోగి నీ అరెస్ట్ చేసారు బాగానే ఉంది. మరి కొలికపూడి శ్రీనివాసరావు బెజవాడ ఎంపీ శివనాధ్ మీద చేసిన ఆరోపణలు మీద కూడా సిట్ చేత దర్యాప్తు చెయించాలి. అప్పుడు మాత్రమే సమన్యాయం చేసిన వారు అవుతారు. ఆ దిశగా చర్యలకు ఉపక్రమించాలి,”అని ప్రభుత్వానికి శివాజీ విజ్ఞప్తి చేశారు.