లండన్ లో చంద్రబాబు బిజీబిజీ
లండన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్లోబల్ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతూ విశాఖ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు.
ప్రస్తుతం లండ్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు లండన్‌లో గ్లోబల్ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు కానున్నారు. పర్సనల్ విజిట్‌గా సతీమణి నారా భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు లండన్ కు వెళ్లారు. భువనేశ్వరిని నవంబర్ 4న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) నుండి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025అవార్డుతో నారా భువనేశ్వరిని సన్నానించనున్నారు. అయితే ఈ ట్రిప్ ను కూడా ఉపయోగించుకోవాలసి సీఎం చంద్రబాబు ఆలోచనలు చేశారు. ఏపీకి పెట్టుబడులు రాబట్టుకోవడం, విశాఖలో నవంబరులో నిర్వహించే పారిశ్రామికవేత్తల సమావేశాలకు ఆహ్వానం అందించాలని భావించారు. అందులో భాగాంగా లండ్ లోని పారిశ్రామికవేత్తలను కలిసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ, విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ (CII) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తారు.
ఈ రోజు ముఖ్యమంత్రి మొదట ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జరాల్డ్‌తో సమావేశం కానున్నారు. అనంతరం హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరోప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజా లతో భేటీ అవుతారు. రోల్స్ రాయిస్ గ్రూప్ సీటీఓ నిక్కి గ్రేడీ స్మిత్‌తో కూడా చర్చలు జరుపనున్నారు. ఎస్రామ్, ఎమ్రామ్ గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీ, శామ్కో హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయ్‌తో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాల్లో ఆక్సిజన్, రెన్యువబుల్ ఎనర్జీ, హెల్త్‌టెక్, గ్రాఫీన్ వంటి రంగాల్లో సహకారాలు చర్చించనున్నారు.
అనంతరం లండన్‌లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని, వారిని విశాఖ సదస్సుకు ఆహ్వానిస్తారు. ఈ సమావేశానికి బ్రిటిష్ హెల్త్‌టెక్ పరిశ్రామలు అసోసియేషన్ ఎండీ పాల్ బెంటన్, ఏఐపాలసీ ల్యాబ్, ఫిడో టెక్, పీజీ పేపర్ కంపెనీ, నేషనల్ గ్రాఫీన్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు హాజరవుతారు. సాయంత్రం భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామితో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఈ విజిట్‌లో తెలుగు డయాస్పోరాతో కలిసి ఆంధ్ర ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను ప్రమోట్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసుకున్నారు.