పెద్దమ్మతల్లిని దర్శించుకున్నబ్రాహ్మణి

నవరాత్రుల్లో జరిపే పూజలకు శనివారం చివరి రోజు కావటంతో దేవాలయంలో పెద్దమ్మతల్లికి బ్రాహ్మణి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు.

Update: 2024-10-12 06:49 GMT

నారా చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి శనివారం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి దేవాలయంకు ఉదయం బ్రాహ్మణి చేరుకున్నారు. నవరాత్రుల్లో జరిపే పూజలకు శనివారం చివరి రోజు కావటంతో దేవాలయంలో పెద్దమ్మతల్లికి బ్రాహ్మణి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. పూజల తర్వాత ఆలయ పూజారులు ఆమెకు తీర్ధ, ప్రసాదాలు అందించారు. దసరా చివరిరోజు కావటంతో దేవాలయంలో వాహన పూజలు ప్రత్యేకంగా జరుపుతారు. వాహనపూజల్లో పాల్గొనేందుకు యజమానులు పెద్దఎత్తున తమ వాహనాలను తీసుకొస్తారని అందరికీ తెలిసిందే.

దేశవ్యాప్తంగా శనివారం శరనవరాత్రులు ముగియబోతున్నాయి. చివరిరోజు కావటంతో పెద్దమ్మతల్లి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దసరా సందర్భంగా పూజలు చేసుకోవటం బ్రాహ్మణికి మామూలే. పెద్దమ్మతల్లి దేవాలయంకు వచ్చి బ్రాహ్మణి ప్రత్యేకపూజలు నిర్వహించటంతో తెలుగుదేశంవర్గాలంతా ఆమెతో పాటు దేవాలయానికి చేరుకున్నారు. ఈమధ్యనే దసరాపండుగ సందర్భంగా చంద్రబాబునాయుడు, నారా భువనేశ్వరి, కొడుకు దేవాన్ష్, భర్త లోకేష్ తో కలిసి విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మను దర్శించుకున్న విషయం తెలిసిందే. కుటుంబం అంతా కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు.

ఇదేసందర్భంగా తిరుమల శ్రీవారి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చంద్రబాబు తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారిని, విజయవాడలోని కనకదుర్గ దేవాలయంలో కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్న బ్రాహ్మణి హైదరాబాద్ లోని పెద్దమ్మతల్లి దేవాలయంకు మాత్రం ఒక్కతే వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించటం గమనార్హం.

Tags:    

Similar News