అమరావతిలో ‘నమో’ నామస్మరణ
ప్రధాని నరేంద్ర మోదీని ఆకట్టుకునే విధంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఒక దశలో లోకేష్ ప్రసంగానికి మోదీ నమస్కారం చేశారు.;
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న అమరావతి పునర్నిర్మాణ సభలో ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ నమో నామస్మరణ చేశారు. మూడు సార్లు నమో, నమో, నమో అంటూ నమో మోదీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. పాకిస్తాన్ ను నమో నాయకత్వంలో మట్టికరిపిస్తామని అన్నారు. నమో నాయకత్వానికి, నా అన్న పవనన్నకు, అమరావతి కోసం పోరాడిన రైతులకు సుభా కాంక్షలు తెలిపారు.
అమరావతి పునర్నిర్మాణ సభలో పాల్గొన్న విద్యశాఖ మంత్రి లోకేష్ ఉద్వేగ భరిత ఉపన్యాసం చేశారు. మోదీని మెప్పించేందుకు ప్రయత్నించారు. ఎంటైర్ నేషన్ మన నమో. నమో గారికి అమరావతి, ఆంధ్రప్రదేశ్ అన్నా ఎంతో ప్రేమ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ కోరిన అన్ని కోర్కెలు తీరుస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడు. నిధులే కాదు పనులు కూడా ప్రారంభిస్తారు. అని ప్రధాన మంత్రిని లోకేష్ కట్టుబట్టలతో బయటకు వచ్చినప్పుడు సీబీఎన్ ఎక్కడ ఉండాలో తెలియక అభివృద్ధి వికేంద్రీ కరణతో ముందుకు వెళుతున్నాం. 2014 నుంచి 2019 వరకు విధ్వంస పాలన చూశాం. చిన్న పిల్లోడి నుంచి ముసలోడి వరకు అమరావతి కోసం పోరాటం చేశారు. జై అమరావతి అంటే రైతులను కొట్టించారు. అమరావతి రైతులు దగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు ఉద్యమం కొనసాగింది. అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న మొక్క కాదు. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది మన నమో. అమరావతి అన్ స్టాపబుల్. అన్ని పనులు జడ్ స్పీడ్ తో జరుగుతాయి. సీబీఎన్, పవన్ అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్నారు అని అన్నారు.
వరల్డ్ మ్యాప్ లో పాకిస్థాన్ మిస్సింగ్ ఖాయం!
పాకిస్థాన్ గీత దాటింది… అమాయకుల్ని చంపి చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్థాన్ కాదు, వంద పాకిస్థాన్లు వచ్చినా భారతదేశం నేల పై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ పేరు నరేంద్ర మోదీ. సింహం ముందు ఆటలు ఆడకూడదు. మన సింహం నమో కొట్టే దెబ్బకు వరల్డ్ మ్యాప్ లో పాకిస్థాన్ మిస్సింగ్ అని రావడం ఖాయం. పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేసే వారు సెలవు పెట్టి పారిపోతున్నారు, కొంత మంది రాజీనామా చేస్తున్నారు... దటీజ్ నరేంద్ర మోదీ. నమో కొట్టే దెబ్బకి పాకిస్థాన్ దిమ్మతిరగడం ఖాయం. పాకిస్థాన్‌కు ధీటుగా సమాధానం ఇవ్వడానికి దేశం మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలుస్తుంది.పహాల్గామ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నాను. ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది.
జెట్ స్పీడ్ తో అభివృద్ధి వికేంద్రీకరణ
ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇక మనకు తిరుగులేదు, అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ జెట్ స్పీడ్ తో జరగబోతుంది. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లా లో సిబిజి ప్లాంట్స్ ...ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి అన్ని రకాలుగా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారు. మనం గతాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలి. 2014లో కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేసారు. ఎక్కడి నుండి పరిపాలన ప్రారంభించాలో తెలియని పరిస్థితి. చంద్రబాబు గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్క సంక్షేమం - మరో పక్క అభివృద్ధి చేసి చూపించారు. అందరూ ఆమోదం తెలిపిన తరువాతే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రైతుల త్యాగంతో అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని - అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండాతో పనిచేసాం. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమైబైల్ హబ్ గా తయారు చేసాం, గోదావరి జిల్లాల్లో ఆక్వా ను ప్రోత్సహించాం, ఉత్తరాంధ్రలో ఫార్మా, ఐటీ కంపెనీలను తీసుకొచ్చాం.
ఇప్పుడు ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి ఆంధ్రప్రదేశ్ అన్నా, అమరావతి అన్నా ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీ లో ఎంత బిజీగా ఉన్నారో మన అందరికీ తెలుసు. అయినా ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయేకి 94 శాతం సీట్లు ఇచ్చారు . మన ప్రధాని నరేంద్ర మోదీజీ ఆంధ్రప్రదేశ్ కోరిన ప్రతి కోరికను తీరుస్తున్నారు. గతంలో విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసి గ్రీన్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేసారు. విశాఖ ఉక్కును కాపాడారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా పనులు తిరిగి ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. రెండూ పవర్ ఫుల్ ఇంజిన్లు. ఒక పక్క పవర్ ఫుల్ ఇంజిన్ నమో, మరో పక్క మన చంద్రబాబు గారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన చంద్రబాబు, పవనన్న. ఇక మనకు తిరుగు లేదు.
20లక్షల ఉద్యోగాల కల్పనదిశగా అడుగులు
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడులు వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. 1,85,000 కోట్లు పెట్టుబడి, 57 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఎన్టిపిసి గ్రీన్ ఎనర్జీ విశాఖపట్నం రాబోతుంది. 1,36,000 కోట్లు పెట్టుబడి, 55 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఆర్సెల్లార్ మిట్టల్ అనకాపల్లి కి రాబోతుంది. 97,000 కోట్లు పెట్టుబడి, 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించే బిపిసిఎల్ రామాయపట్నం కి రాబోతుంది. తిరుపతి జిల్లా కు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, కర్నూలు, కడప, అనంతపురం కు రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రకాశం కు రిలయన్స్ సిబిజి. ఉత్తరాంధ్ర కు ఫార్మా, ఐటి ఇలా అన్ని జిల్లాలను అభివృద్ధి చేయబోతున్నాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.