బంగాళాఖాతంలో బలపడిన మోంథా
గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్
By : The Federal
Update: 2025-10-28 04:02 GMT
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మొంథా బలపడింది.
గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో తుపాన్ కదులుతూ ఉంది.
ప్రస్తుతానికి మచిలీపట్నంకి 190 కిమీ, కాకినాడకి 270 కిమీ, విశాఖపట్నంకి 340కిమీ దూరంలో కేంద్రీకృతమయింది.
ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయి.
దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయి.
కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని,
ప్రభుత్వ యంత్రాంగం మీతో ఉంది భయాందోళనలకు గురికావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది.