TDP MAHANAADU | లక్షమంది టీడీపీ శ్రేణులకు భోజన వసతి
రాయచోటి గువ్వలచెరువు ఘాట్ వద్ద కడప టీడీపీ మహానాడుకు వెళ్లే వారికి భోజన సదుపాయం కల్పించారు. మంత్రులు బీసీ జానార్థనరెడ్డి, మండిపల్లి ఏర్పాట్లు పరిశీలించారు.;
కడపలో మూడు రోజుల పాటు నిర్వహించే టీడీపీ మహానాడుకు వెళ్లే నేతలు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా లక్ష మందికి సరిపడ భోజన వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కడపకు మార్గంలో రాయచోటి నియోజవకవర్గం రామాపురం మండలం దాటగానేక గువ్వలచెరువు ఘాట్ ప్రారంభం అవుతుంది. ప్రారంభంలోనే ఖాళీ ప్రదేశంలో విస్తృత ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర మంత్రి బీసీ. జనార్థనరెడ్డితో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.
ఈనెల 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే మహానాడు సందర్భంగా రాయచోటి ప్రాంతం నుంచి వచ్చే టిడిపి నాయకులు, కార్యకర్తలు దాదాపు లక్ష మంది పైచిలుకు ప్రజలకు భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప మహానాడుకు వెళ్లే కార్యకర్తలు, నాయకుల కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ చెప్పారు.