"విద్యార్థులూ.. కలలు గొప్పగా కనండి".. మానవత

2024 పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన గుంటూరు విద్యార్థులకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించింది.

Update: 2024-04-28 12:37 GMT

ప్రస్తుతం ప్రపంచంలో ఎవరితో వెనకబడకుండా పరుగులు పెట్టాలన్న ఆందోళనలో విద్యార్థులు కలలు కనలేకపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. అందిన కాడికి అవకాశాలు చేజిక్కించుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారే తప్ప జీవితం పట్ల ఆశయంతో దాన్ని నెరవేర్చుకునే కలలు కనడాన్ని విద్యార్థులు మరిచి పోతురున్నారని నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు తమ జీవితానికి సంబంధించిన వరకూ అవధులు లేని కలలు కనాలని, తాము కనే ఆ గొప్ప కలల సాకారనికి కృషి చేయాలని మానవతా స్వచ్చంద సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్షణరెడ్డి సూచించారు.

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నెల సమావేశాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన సమావేశాన్ని ఆ సంస్థ గుంటూరు రామన్నపేటలోని జన చైతన్య వేదిక సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి లక్ష్మణరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఉప్పల సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి లక్ష్మణరెడ్డితో పాటుగా అవగాహన సంస్థ అధ్యక్షుడు కొండా శివరామిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివరామిరెడ్డి మాట్లాడుతూ.. గుంటూరుకు చెందిన వావిలాల గోపాలకృష్ణయ్య, కాసరనేని సదాశివరావు లాంటి ప్రముఖుల సేవలను కొనియాడారు. ప్రతి రోజు ఒక్క చిన్నదైనా సమాజ సేవ చేసేలా దిన చర్య ఉండాలన్నారు.

అనంతరం మాట్లాడిన మానవత ఛైర్మన్ పావులూరి రమేష్.. సంస్థ చేపడుతున్న అనేక కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొరిటాల శేషగిరిరావు మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ప్రముఖ మానసిక వికాస నిపుణులు డాక్టర్ నూతలపాటి అరవింద్ ప్రసంగిస్తూ నేటి యువతరం మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును ప్రమాదంలో నెట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ. నారాయణ రెడ్డి స్వచ్ఛమైన త్రాగు నీటి సరఫరా యొక్క అవసరాన్ని తెలియజేశారు. యోగా ద్వారా విశిష్ట సేవలు అందిస్తున్న అన్నవరపు రాకేష్‌ను ఘనంగా సత్కరించారు.

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు

ఈ సందర్భంగా వారంతా కలిసి ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది గుంటూరు విద్యార్థులను అభినందించారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞపికలను అందించారు. అంతేకాకుండా సదరు విద్యార్థులకు రూ.50 ప్రోత్సాహక నగదును అందించారు. ఈ కార్యక్రమంలో మానవత సెక్రెటరీ వర్రె సుబ్రమణ్యం, ట్రెజరర్ టీవీ సాయిరాం, డైరెక్టర్ బిఎన్ మిత్ర, సి హెచ్ రామబ్రహ్మం, లక్ష్మీ సామ్రాజ్యం, శివాజీ, కె సత్యనారాయణ, ఎన్ సాంబశివరావు, టి ధనుంజయ రెడ్డి, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, మానవత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News