MADANAPALLI | మదనపల్లి: సబ్ కలెక్టరేట్ కు పూర్వవైభవం
రెవెన్యూ పరిపాలన వ్యవహారాలు పునః ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఇక్కడ రికార్డులు దగ్ధమైన విషయం తెలిసిందే.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-02-19 09:33 GMT
చారిత్రక మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పూర్వస్థితికి తీసుకొని వచ్చారు. ఈ కార్యాలయంలో గత ఏడాది రెవెన్యూ రికార్డులు అవమానాస్పద స్థితిలో దగ్ధమైన విషయం తెలిసింది. దీనికి సంబంధించిన దర్యాప్తు సాగుతూనే ఉంది. కాగా,
చిత్తూరు జిల్లా ( అన్నమయ్య జిల్లా) మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి మళ్లీ కళకళలాడుతుంది. బుధవారం నుంచి ఈ కార్యాలయంలో యధావిధిగా రెవెన్యూ పరిపాలన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
పూజలు చేయడం ద్వారా పరిపాలన వ్యవహారాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్ పి సిసోడియా ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలోని తహసీల్దార్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఏం జరిగింది..
2024 జూలై 21వ తేదీ అర్ధరాత్రి (ఆదివారం) మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు దద్దమైన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు అంటే సోమవారం వేకువ జామున ఈ ఘటన వెలుగు చూసింది. ఈ సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఆనాటి డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ను వెంటనే మదనపల్లికి వెళ్లాలని ఆదేశించారు.
ఆ తర్వాత రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్ పి సిసోడియా కూడా మదనపల్లి కు వచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో దగ్ధమైన ఫైళ్లను కూడా పరిశీలించారు. ఈ ఘటనలో మదనపల్లె డివిజన్ పరిధిలోని 28 ఏ , 21 ఏ కు సంబంధించిన రికార్డులు, పాత ఫైల్లు కూడా దగ్ధమయ్యాయి అనే విషయం తేల్చారు. ఆ తరువాత ఈ కేసును సిఐడి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఆర్డిఓ హరిప్రసాద్, ముందు పని చేసిన మురళి, ఆదివారం అయినా కార్యాలయంలోనే రాత్రి వరకు ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ ఈ వ్యవహారం నడిచింది.
చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం వల్లే సబ్ కలెక్టర్ కార్యాలయంలో దగ్ధం చేయడానికి కుట్ర జరిగిందని కోణంలో విచారణ సాగుతోంది. దీనిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా కోర్టును ఆశ్రయించడం. పెద్దిరెడ్డి మనుషులు తమ నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకున్నారనే విషయంలో కూడా బాధితులు ఫిర్యాదులు అందించారు. దీనిపై దర్యాప్తే కాకుండా, న్యాయపరమైన వ్యాజ్యాలు కూడా కోర్టులో సాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా..
ప్రారంభమైన రెవెన్యూ కలాపాలు
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన నేపథ్యంలో ఆ గదులను సిఐడి అధికారులు ఆధీనంలో ఉంచుకున్నారు. కొందరు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వైసిపి నేతలకు అండగా నిలిచి, భూముల వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కేసులో కూడా నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో నిత్య కార్యక్రమాలు కొంతమేరకే సాగుతూ వచ్చాయి. తాజాగా మంటల ధాటికి పొగ చూరిన గదులు, గోడలనుశుభ్రం చేయించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో మళ్ళీ పరిపాలనా వ్యవహారాలు పునరుద్ధరించడానికి వీలుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా పూజలతో ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, రాయచోటి ఆర్డీవోశ్రీనివాస్, మదనపల్లె తహసిల్దార్ ధనుంజయులు, మదనపల్లి డివిజన్లోని రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.