నాన్నే నా లైఫ్‌ టైమ్‌ గురువు – నారా లోకేష్‌

మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో లోకేష్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

Update: 2025-09-25 14:49 GMT

‘ప్రపంచంలో ఎంతగొప్పవారైనా వారు ఏదో ఒక స్థాయిలో ఓ గురువు వద్ద శిష్యులే. నా జీవితంలో అటువంటి లైఫ్‌ టైమ్‌ గురువు మా నాన్న.. నారా చంద్రబాబు నాయుడు గారే‘ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో లోకేష్‌ మాట్లాడుతూ.. గురుత్వాన్ని, గురువు ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా భావోద్వేగంగా స్పందించారు. ‘దేశానికి నాయకుడు అయినా ఓ గురువు వద్ద చదువుకున్న విద్యార్థే. వరల్డ్‌ రిచ్చెస్ట్‌ పర్సన్‌ అయినా ఓ స్టూడెంట్‌ గానే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు‘ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘లాస్ట్‌ బెంచ్‌ నుండి స్టాంఫోర్డ్‌ వరకు‘
తన విద్యార్హతల పయనాన్ని గుర్తు చేసుకుంటూ లోకేష్‌ మాట్లాడుతూ, ‘స్కూల్‌లో మేము గోల బ్యాచ్‌. మేము ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఫస్ట్‌ బెంచర్స్‌’ – అంటే మాది లాస్ట్‌ బెంచ్‌. అయినప్పటికీ లాస్ట్‌ బెంచ్‌ నుండి స్టాంఫోర్డ్‌ యూనివర్సిటీ వరకు నా ప్రయాణం సాగింది‘ అని చెప్పారు. ‘మంజులా మేడం కొట్టిన తూటా దెబ్బలు, రమాదేవి మేడం నేర్పిన డిసిప్లిన్‌ నాకు జీవితాంతం గుర్తుంటాయి‘ అని వెల్లడించారు. ఇంటర్‌లో నారాయణ మాస్టారు బోధించిన బ్రిడ్జ్‌ కోర్సు, కార్నెగీ మెల్లన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ రాజిరెడ్డి మార్గదర్శనం తనపై ఎలాంటి ప్రభావం చూపిందో చెప్పుకొచ్చారు.
గురువుల పట్ల గౌరవం 
‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తనకు కృష్ణుడితో సమానమైన గురువు అని మహాత్మాగాంధీ అన్నారంటే, గురువు స్థానం ఎంత ఉన్నతమో అర్థం అవుతుంది. బాలికా విద్య కోసం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి మరువలేనిది‘ అంటూ లోకేష్‌ గురువుల విలువను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్‌ విజయరామరాజు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Tags:    

Similar News