లోసారి కవిత్వము సమాజంలో ‘విస్ఫోటనం’
మనుషుల్ని ఆవిష్కరించిన పుస్తకం ఆయుధం లాంటి మనిషి అని ప్రముఖ విమర్శకులు మేడిపల్లి రవికుమార్ అన్నారు.;
లోసారి కవిత్వము మనుషుల్ని ఆవిష్కరించిన, సంస్కరించిన కవిత్వమని, సమాజంలో విస్ఫోటనం అని, ఆయుధం లాంటి మనిషి పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు ఆచార్య మేడిపల్లి రవికుమార్ లాయర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో బుధవారం సీపి బ్రౌన్ గ్రంథాలయంలో అడిషనల్ ఎస్.పి లోసారి సుధాకర్ రచించిన ఆయుధం లాంటి మనిషి పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశ్రాంతి చార్యులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ ఈ పుస్తక ఆవిష్కరణతో పాటు పుస్తక సమీక్షను చేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ.. అమ్మ వైపు తప్ప అమ్మ రుణం తీర్చుకోలేవురా అని ఆయన కవిత్వం లో ప్రశ్నిస్తారు. అమ్మను అమ్మలా చూసుకుంటే అమ్మను ఎంతమందిని ఈరోజు సమాజంలో పుట్టిస్తున్నాము అని ప్రశ్నించే తత్వం కనిపిస్తుంది. ప్రతి పనిలోనూ ఒక మాతృమూర్తి ఉంటారని తెలిపారు.
ఈ పుస్తకంలో మొత్తం 72 కవితలు ఉన్నాయని, 72 పార్శ్వాలు కనిపిస్తాయి అన్నారు. కవిత్వానికి శిల్పం అంటే అవి మ్యూజియంలో పెట్టుకోవాలి తప్ప సమాజానికి పనికిరావు అన్నారు. కవిత్వమంటే సమాజంలో సమాజంలోని ప్రజల స్థితిగతులు వారి కష్టాలు కన్నీళ్లు అన్నిటిని చెప్పించడమే కవిత్వమని ఈ విషయాలన్నీ మరోసారి సుధాకర్ రచించిన ఆయుధం లాంటి మనిషి, మైనపు బొమ్మలు ఇతర కవిత పుస్తకాల్లో కనిపిస్తాయన్నారు. లోసారి వాస్తవాన్ని దర్శించడంలో విశ్లేషించడంలో ఈయన కవిత్వంలో కనిపిస్తాయని అన్నారు. రుజుమార్గంలో సమాజాన్ని చూడడం సుధాకర్ కవిత్వంలో ఉంటుందన్నారు. కావ్యం రాసిన వాడే కవి.. మంచిగా ఆలోచించే ప్రతీ వ్యక్తి కూడా కవిగానే భావించాలన్నారు. ఒక కవి మాత్రమే ఏకకాలంలో మూడు లోకాలను చూడగలరని అన్నారు. మంత్ర ముగ్ధుల్ని చేసేటువంటి కవిత్వ నిర్మాణము లోసారి సుధాకర్ కార్యక్రమంలో ఉంటుందన్నారు.