CM Chandrababu | ఐటీతో ఉద్యానం, వ్యవసాయం అనుసంధానం

ఐ‌టి నైపుణ్యంతో యువత వన్నె తెచ్చారు. రతనాలసీమగా మార్చడానికి ఆ మూడు రంగాలను అనుసంధానం చేస్తానని సీఎం ప్రకటించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-02-01 14:07 GMT

రాయలసీమలో ఉద్యానపంటలకు పుట్టినిల్లు. దీనిని మరింత ఆదాయ వనరుగా మార్చుకోవాలి. దీనికోసం ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చడానికి ఉద్యానవనహబ్ తీర్చిదిద్దడం ద్వారా ప్రధాన ఆదాయ వనరుగా అభివృద్ధి చేస్తాం" అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాంతంలో కూరగాయలు సాగు చేసే రైతులు అధికంగా ఉన్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేక అనేక మంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర ఇవ్వడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు చెప్పారు. మూడు రంగాలను అనుసంధానంతో ఉత్పత్తి, మార్కెటింగ్ తద్వారా గిట్టుబాటు ధరకు ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.



అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో శనివారం ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి, ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. కొందరికి ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేశారు. గ్రామంలో సోలార్ ప్యానెల్లు అమర్చిన ఇళ్ల వద్దకు పరిశీలించారు. రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత అయిదేళ్లు కష్టాలు ఆరు నెలల్లో అధిగమించేందుకు మార్గదర్శకాలను తయారు చేసి, అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. దీనికోసం 15 శాతం గ్రోత్ రేట్ పెరగాలన్నారు. 2047 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలపడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెంచడానికి సమష్టి కృషి అవసరం అన్నారు.

ఉద్యానపంటలతో లాభం
రాయలసీమలో హార్టికల్చర్ ( Horticultural ), ఆంధ్రాలో ఆక్వా కల్చర్ ( Aqua culture) , కోస్తాలో ఆయిల్ ఫామ్ ( Oil palm) పంటలు ఆర్థిక లాభాలకు బాటలు వేసేలా చర్యలు చేపడుతున్నాం అన్నారు. సంపదను స్తృస్టించే మార్గాలు తెలివి తేటలతోనే వస్తాయని, ఆ తెలివి అనేది మన పిల్లల చదువులోనే వుందన్నారు. అందుకోసం మన పిల్లలకు మంచి విద్యను అందించాలన్నారు. రాష్ట్రంలో సంపద స్తృష్టించాలి. తలసరి ఆదాయం పెంపొందించాలన్నారు. 2047 నాటికి దేశ ఆదాయంలో 12 శాతం అధికంతో 58 శాతం ఆదాయ రేటును పెంచేలా ప్రణాళికలు, చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
"వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రాన్ని ఎడారిగా చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సస్యశ్యామలం చేసుకోగలిగాం" అంటే దీనికి ప్రజలు టీడీపీ కూటమికి ఇచ్చిన మంచి అవకాశం అని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమ ( Rayalasemma) లో అన్ని ప్రాంతాలకు నీటి వనరును కల్పిస్తే.. బంగారు పంటలు పండుతాయనీ, ఆ దిశగా.. రాష్టంలో పెండింగా ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. సాగు నీరు అందించిన ఎన్టీ రామారావు రాయలసీమను రతనాల సీమగా మార్చే దిశగా అడుగులేశారని గుర్తు చేసిన ఆయన అదే బాటలో ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేస్తామన్నారు.
సోలార్ విద్యుత్ తో...

ఇంటిపైనే సోలార్ పవర్ ఉత్పత్తి ( Solar power) చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అని గుర్తు చేశారు. పేదల సేవలో జిల్లా కలెక్టర్ల మొదలు గ్రామ కార్యదర్శుల వరకు క్షేత్ర స్తాయిలో సేవలు అందిస్తున్నారన్నారు. గుడ్ గవర్నెన్స్ లో భాగంగా వాట్సప్ ద్వారా పార సేవలను అందించే సరళమైన సదుపాయాన్ని కల్పించామన్నారు. ఉచిత వంట గ్యాసు, నిరంతర సోలార్ పవర్ సదుపాయాలను అందించడంతో పాటు.. పెన్షన్ల మొత్తాన్ని పెంచి 1వ తేదీనే పంపిణీ వంటి చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులను ఆచరణలోకి తెచ్చామన్నారు.
ప్రజల నమ్మకం కాపాడుతాం..
టీడీపీ కూటమిపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించాం. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాం. వాటిని ఆచరించి.. ఫలితాలను అనుభవించాల్సి బాధ్యత మీ చేతుల్లోనే ఉందన్నారు. ముందుకుగా చెప్పినట్లు విశాఖకు రైల్వే జోన్ తీసుకువచ్చిన ఘనత టీడీపీ కూటమిదే అన్నారు. ప్రస్తుతం 64 లక్షల మందికి పెన్షన్ల మొత్తం పెంచామంటే పేదవారిపై టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఉన్న బాద్యత, విశ్వాసాన్ని గుర్తు చేస్తోందన్నారు. దేశంలో మొదటిసారి దీపం పథకం ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అందించిన ఘనత కూడా తమదే అన్నారు. దాదాపు 28 రకాల పేదలకు ఆర్థిక భరోసా అందిస్తూ, వారి నమ్మకాన్ని కాపాడుకుంటున్నట్లు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు.
అమలాపురాన్ని మించిన ఆదాయం
తెలివితేటలతో పనిచేస్తే ఏదయినా సాధ్యం అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఈ కృషిలో అమలాపురానికి మించి అనంతపురం ఆదాయం పెంచగలిగామని ఆయన తెలిపారు. "రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందించి సస్యమమలం చేసేందుకు నా శాయశక్తుల కృషి చేస్తా" అని" ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కోనసీమ కంటే రాయలసీమ అత్యధిక ఆదాయ వనరులు సృస్తిస్తా అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలను కూడా చేపడతాం అని అన్నారు. రాయచోటికి శ్రీనివాసాపురం ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం ఆదాయ వనరుగా మారినప్పుడూ రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రజల చేతిలోె పాలన
"ఒకప్పుడు మీ వద్దకు పాలన అన్నాం. ఇపుడు మీ చేతిలో పాలన చూస్తున్నారు" అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో వాట్పప్ (WATS APP) ద్వారా ఈ గవర్నెన్స్ (E- Governence )సేవలు ప్రారంభించామన్నారు. ప్రజల్లో ఆలోచనా విధానం మారాలని ఆయన సూచించారు. ఐ‌టీ ( Information Technology - IT ) తో ఎలాంటి మార్పు తెచ్చిందో గమనించాలన్నారు.
Tags:    

Similar News