కూటమి దాష్టికాలను ధైర్యంగా ఎదుర్కొందాం
తిరువూరు వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలివారు.;
By : The Federal
Update: 2025-05-21 12:26 GMT
కూటమి ప్రభుత్వం దాష్టికాలను ధీటుగాను, ధైర్యంగాను ఎదుర్కొందామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ కౌన్సిలర్లకు, శ్రేణులకు సూచించారు. తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిశారు. తిరువూరు మున్సిపాలిటీలో చోటు చేసుకున్న పరిణామాల గురించి కౌన్సిలర్లు జగన్‌కు వివరించారు. టీడీపీ శ్రేణులు, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు మున్సిపాలిటీ అంశంలో రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రాజ్యాం్గగానికి తూట్లు పొడుస్తూ ఖూఈ చేస్తోందని మండిపడ్డారు. మెజారిటీలు లేక పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న కూటమి వర్గాలు బరితెగించారని ధ్వజమెత్తారు. టీడీపీకి మెజారిటీలు లేక పోయినా అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఒక సంవత్సరం పూర్తి అయిందని, మిగిలిన ఏళ్లు కూడా కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగాను, ధైర్యంగాను ఎదుర్కొందామని వారికి సూచించారు. కార్యకర్తలు, నాయకులు ఎక్కడా తమ ధైర్యాన్ని కోల్పోవద్దని, కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరో ఇచ్చారు. చట్టపరంగా, న్యాయపరంగా శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పెట్టి ఇబ్బందులను, సమస్యలను తట్టుకుని పార్టీ కోసం నిలబడినందుకు కౌన్సిలర్లందరికీ హాట్సా‹ఫ్ చెప్పారు.