నన్నుమాట్లడనివ్వండి..ప్లీజ్‌, ఏపీ మండలిలో వైసీపీ సభ్యురాలు వేడుకోలు

మండలిలో వైఎస్‌ఆర్‌సీపీపై మంత్రులు మూకుమ్మడి దాడి. వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు మాట్లాడుతున్న సమయంలో అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. చైర్మన్ కూడా విసిగి పోయారు.

Update: 2024-11-14 12:48 GMT

నన్ను మాట్లాడనివ్వండి.. ప్లీజ్, అంటూ అధికార పక్షం మంత్రులకు విజ్ఞప్తి చేసిన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి, ఆపండమ్మా.. నన్ను మాట్లాడనివ్వండి.. అంటూ ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేయాల్సి వచ్చింది. అంతేకాదు.. రన్నింగ్‌ కామెంట్రీ ఆపండని అదే మంత్రులకు చైర్మన్‌ హెచ్చరికలు చేయాల్సి వచ్చింది. చర్చ సజావుగా సాగేందుకు సహకరిస్తే కొనసాగిద్దాం.. లేదంటే వాయిదా వేస్తా. అంటూ మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు గురువారం శాసన మండలిలో అధికార పక్షం మంత్రులు, సభ్యులకు హెచ్చరికలు చేశారు. ఒక సారి కాదు.. రెండు సార్లు కాదు. బడ్జెట్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సభ్యురాలు కళ్యాణి మాట్లాడుతున్నంత సేపు శాసన మండలిలో ఇదే రకమైన వాతావరణం నెలకొంది. రన్నింగ్‌ కామెంట్రీతో పదే పదే అడ్డంకులు సృష్టేంచేందుకు కూటమి మంత్రులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పడు రన్నింగ్‌ కామెంట్రీ ఆపాలని మండలి చైర్మన్‌ మోషన్‌ రాజు అధికార పక్ష సభ్యులను వారిస్తున్నా, పెడ చెవిన పెడుతూనే ఉన్నారు.

Delete Edit

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో గురువారం బడ్జెట్‌పైన చర్చ జరిగింది. దీనిపై మాట్లాడేందుకు వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు వరుదు కళ్యాణికి అవకాశం ఇచ్చారు. అప్పటికే అధికార పక్షం మంత్రులు ఎక్కువ మంది మండలిలో ఉన్నారు. ముందే అనుకున్నారేమో కానీ అధిక సంఖ్యలో మంత్రులందరూ వచ్చి ఆసీనులయ్యారు. కళ్యాణి బడ్జెట్‌పై మాట్లాడటం మొదలు పెట్టినప్పటి నుంచి అధికార పక్షానికి చెందిన సభ్యులు కాస్తా కామ్‌గా ఉన్నా.. మంత్రులు మాత్రం అడ్డుకుంటూనే ఉన్నారు. ఒకే బెంచ్‌లో కూర్చున హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, వారి కంటే కాస్తా వెనుక బెంచ్‌లో కూర్చున్న బిసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కళ్యాణి స్పీచ్‌కు అడ్డు తగులుతూనే ఉన్నారు. కళ్యాణి మాట్లాడుతున్న ప్రతి అంశానికి అడ్డు తగులుతూ మాట్లాడేందుకు ప్రయత్నించారు. వీరికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు కూడా జత కలవడంతో కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకోవడం ఎక్కువైంది. దీనికి తోడు మంత్రులు సంధ్యారాణి, అనితల రన్నింగ్‌ కామెంట్రీతో కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఓ దశలో వీరి కామెంట్రీతో విసిగి పోయిన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యురాలు కళ్యాణి నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్‌ అంటూ విజ్జప్తి చేశారు. అంతటితో ఆగని మంత్రుల రన్నింగ్‌ కామెంట్రీపై మరో సారి ‘ఆపండమ్మా.. నన్ను మాట్లాడనివ్వండి’ అని తీవ్ర స్వరంతో హెచ్చరించడంతో.. తమను ఎవ్వరూ చూడటం లేదని భావించిన ఆ మంత్రులు.. తమ చేతులను నోటికి అడ్డం పెట్టుకొని నవ్వుతూ టీవీ స్కీన్‌పై కనిపించడం విశేషం. మరో వైపు మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు కూడా మంత్రుల రన్నింగ్‌ కామెంట్రీ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు రన్నింగ్‌ కామెంట్రీ ఏంటని మంత్రులను హెచ్చరించారు. అయినా వారి రన్నింగ్‌ కామెంట్రీ శృతి మించడంతో చర్చకు సహకరిస్తే కొనసాగిస్తా.. లేదంటే మండలిని వాయిదా వేస్తానని చైర్మన్‌ హెచ్చరించడంతో సదరు మంత్రులు సర్థుమణిగారు. దీంతో కళ్యాణి తన ప్రసాంగాన్ని పూర్తి చేశారు.

Tags:    

Similar News