ఇంత క్షేమంగా తిరిగి వస్తాం అనుకోలేదు..

నేపాల్ నుంచి రేణిగుంటకు చేరిన రాయలసీమ వాసులు.;

Update: 2025-09-11 18:31 GMT
రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ ప్లకార్డు చూపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న యాత్రికుడు

విహారయాత్రకు వెళ్లి, నేపాల్ లో చిక్కుకున్న రాయలసీమ ప్రాంతానికి చెందిన 40మంది క్షేమంగా తిరిగి వచ్చారు. రేణిగుంట విమానాశ్రాయానికి గురువారం రాత్రి చేరుకున్నారు.

"నేపాల్ లో భయానక పరిస్థితుల నుంచి ఇంత క్షేమంగా తిరిగి వస్తామని అనుకోలేదు" అని ఉద్వేగానికి లోనయ్యారు. విమానాశ్రయం లాంజ్ లో నేపాల్ నుంచి తిరిగి వచ్చిన యాత్రికులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్ స్వాగతం పలికారు. వారికి తిరుమల శ్రీవారి ప్రసాదాలు అందించారు.స్వప్రాంతానికి వెళ్లడానికి ఏర్పాటు చేశారు.

తిరుగుబాటు కారణంగా నేపాల్ లో హింస చెలరేగింది. విహారయాత్రలో ఆనందంగా గడపాలని వెళ్లిన తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. దాదాపు 48 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
నేపాల్ లో చిక్కుకున్న 215 మందిని సురక్షితంగా వెనక్కు తీసుకుని రావడానికి సీఎం నారా చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. 48 గంటల తరువాత కర్నూలు జిల్లాకు చెందిన 22 మంది గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

నేపాల్, మానససరోవరం ప్రాంతాలకు విహారయాత్రకు రాష్ట్రంలోని విశాఖపట్టణం, విజయనగరం, కర్నూలు, మంగళగిరి తదితర ప్రాంతాల నుంచి విహార యాత్రకు వెళ్లారు. నేపాల్ లో జరిగిన తిరుగుబాటు కారణంగా హింస ప్రజ్వరిల్లింది. దీంతో ఆదేశంలో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. దీంతో ఏపీ నుంచి వెళ్లిన వారిలో దాదాపు 258 మంది నేపాల్ లో చిక్కుకుపోయారు. వారిలో కర్నూలు జిల్లాకు చెందిన వారు 22 మంది ఉన్నట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో

నేపాల్ నుంచి తిరిగి వచ్చిన వారిని స్వాగతిస్తున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

తిరుపతిజిల్లా -9, కడప జిల్లా-19, నెల్లూరు జిల్లా - 5, అన్నమయ్య జిల్లా -3, నంద్యాల జిల్లా -2, అనంతపురం జిల్లా-2, మొత్తం 40 మంది సురక్షంగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు.వారిని స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
ఫలించిన మంత్రి లోకేష్ ప్రయత్నం

అనంతపురంలో ఏర్పాటు నిర్వహించిన సూపర్ 6 విజయోత్సవ సభకు మంత్రి నారా లోకేష్ రాలేదు. నేపాల్ లో చిక్కుకున్న వారిని వెనక్కి తీసుకుని రావడానికి అమరావతిలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఆ కేంద్రంలో కూర్చున్న మంత్రి నారా లోకేష్ నేపాల్ లో ఉన్న వారి కోసం ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేశారు. అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని ఆన్లైన్ లో కాంటాక్ట్ లోకి తీసుకున్నారు. వీడియో కాల్ లో వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు మంత్రులను సమన్వయం చేసుకుంటూ నేపాల్ లో ఉన్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి స్వయంగా పర్యవేక్షించారు.
రేణిగుంట విమానాశ్రయంలో...

నేపాల్ లో చిక్కకున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసింది. ఆ విమానంలోకి ఎక్కిన బాధితులు సీఎం ఎన్. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ జిందాబాద్ అంటూ నినదిస్తూ, కృతజ్ణతలు చాటుకున్నారు. నేపాల్ నుంచి తెలుగువారిలో బయలుదేరిన విమానం గురువారం రాత్రి రేణిగుంట (తిరుపతి) విమానాశ్రాయానికి చేరింది. మంత్రి నారా లోకేష్ ప్లకార్డు ప్రదర్శిస్తూ నేపాల్ నుంచి క్షేమంగా తిరిగి వచ్చిన కర్నూలు జిల్లాకు చెందిన వారంతా ఆనందభాష్పాలు రాలుస్తూ కృతజ్ణతలు చెప్పారు.
ఎదురేగి స్వాగతం..

విమానం రాకపముందే తిరుపతి రేణిగుంట విమానాశ్రాయానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వేంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తోపాటు కూటమి నేతలకు కూడా చేరుకున్నారు. నేపాల్ నుంచి బయలుదేరిన విమానం రేణిగుంటకు చేరింది. లాంజ్ లోకి వస్తున్న కర్నూలు జిల్లా యాత్రికులను కలెక్టర్ వేంకటేశ్వర్ తోపాటు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు స్వాగతించారు. వారికి తిరుమల శ్రీవారు, శ్రీకాళహస్తీశ్వరుని లడ్డూ ప్రసాదాలు అందించి, స్వాగతించారు.

రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి జిల్లా కలెక్టర్ కర్నూలు వెళ్లడానికి ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పించారు. కొందరు తమ సొంత వాహనాల్లో కర్నూలుకు బయలుదేరారు. వారంతా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే క్షేమంగా తిరిగి వచ్చామని ప్రభుత్వానికి కృతజ్ణతలు తెలిపారు.

వీడ్కోలు చెబుతున్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్

నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న తెలుగు వారికి స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, చంద్రగిరి, తిరుపతి, పూతలపట్టు కోడూరు, కడప ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, మురళీమోహన్, ఆరవ శ్రీధర్, మాధవి రెడ్డి, కడప జిల్లా టిడిపి పోలిట్ బ్యూరో టిడిపి ఇన్చార్జి శ్రీనివాస రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్. సి మునికృష్ణ, శ్రీధర్ వర్మ,యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారి భాను ప్రకాష్ రెడ్డి, ఆర్ టి ఓ మురళీమోహన్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News