కృష్ణమ్మ ఉరకలు..పరుగులు

విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.;

Update: 2025-08-01 08:52 GMT

విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీని వల్ల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతోన్న వరద నీటి కారణంగా భారీ స్థాయిలో కృష్ణా నది ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం 2,18,771 క్యూసెక్కుల వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరింది. దీంతో ప్రవాహం పెరిగింది. దీని ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నిటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. ఇలా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో బ్యారేజీ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు ఐదు అడుగుల వరకు 30 గేట్లను, నాలుగు అడుగుల వరకు 40 గేట్లను ఎత్తివేసి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా నదికి పై భాగం నుంచి భారీగా తరలి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ ఉరకలేస్తూ.. పరుగులు తీస్తోంది. వేలాది క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలిసి పోతోంది.

Tags:    

Similar News