లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం
ఏపీ లిక్కర్ స్కాంలో ప్రధానంగా ఉన్న 40 మంది నిందితుల్లో కేసిరెడ్డి పీఏ కు బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వడం ఇదే మొదటి సారి.;
లిక్కర్ కేసులో అరెస్టు అయిన నిందితుల్లో ఒకరి నిందితునికి ఎసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ పొందిన మొదటి వ్యక్తిగా పైలా దిలీప్ చరిత్రకు ఎక్కారని చెప్పొచ్చు. ఈయన ఈ కేసులో ఏ30వ నిందితునిగా ఉన్నారు. 117 రోజులుగా జైల్లో దిలీప్ ఉన్నారు. ఇదే కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డి, ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు డిస్ మిస్ చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ దిలీప్ కు పలు షరతులు కోర్టు విధించింది.
కోర్టు అనుమతి లేకుండా దిలీప్ దేశం వదిలి వెళ్ళకూడదు. పాస్ పోర్ట్ కోర్టుకు సరెండర్ చేయాలి. ప్రతి వాయిదాకి తప్పకుండా హాజరు కావాలి. సాక్షులతో మాట్లాడ కూడదు. సహా నిందితులతో కూడా మాట్లాడకూడదు. లక్ష రూపాయలు 2 ష్యూరిటీ లు సమర్పించాలి. వంటి షరతులు కోర్టు విధించింది.
2025 మే 1న చెన్నైలో పైలా దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి పిఏ పైలా దిలీప్. శనివారం (29-8-2025) జైలు నుంచి పైలా దిలీప్ విడుదల అయ్యే అవకాశం ఉంది. లక్ష చొప్పున రెండు ష్యూరిటిలు సమర్పించాలని ఆదేశించినందున ష్యూరిటీలు ఇచ్చి విడుదలవుతాడు. జైలు నుంచి విడుదల అయిన మూడు రోజుల్లో పాస్పోర్ట్ సిట్ కు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
మాజీ మంత్రి నారాయణస్వామి
ఎఫ్ఎస్ఎల్ కు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫోన్
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ డిప్యూటీ సీఎం, నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ఫోన్ పై సిట్ పోలీస్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇటీవల నారాయణ స్వామిని విచారించిన సమయంలో ఆయన ఫోన్ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ స్వామి ఫోన్ లో డేటా పరిశీలనకు ఫోన్ FSL కు పంపాలని అధికారులు నిర్ణయించారు. FSL కి పంపటానికి అనుమతి ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. లిక్కర్ స్కాం కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదని ఇటీవల మీడియాతో నారాయణస్వామి అన్నారు. దీనిని బట్టి అన్నీ మాజీ సీఎం కనుసన్నల్లోనే జరిగాయని పోలీసులు భావిస్తున్నారు. నారాయణస్వామి పోన్ ను పరిశీలిస్తే తప్పకుండా కొన్ని నిజాలు వల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. నారాయణస్వామి చెబుతున్న ప్రకారం కేసులో కానీ, మంత్రి పదవిలో కానీ తాను నిమిత్తమాత్రుడినేననే వాదన వినిపిస్తోంది.
నిందితుల్లో ప్రధాన మైన ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఎఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కేసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం (Liquor Scam) ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంచనా మొత్తం సుమారు రూ. 3,200 నుంచి 3,500 కోట్లు. YSRCP ప్రభుత్వం (2019-2024) కాలంలో కుంభకోణం జరిగింది. ఇది మద్యం పాలసీలలో అవినీతి, కిక్‌బ్యాక్‌లు, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌తో సంబంధం కలిగి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. TDP నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత SIT (Special Investigation Team) దర్యాప్తు చేపట్టింది. ED (Enforcement Directorate) కూడా PMLA కింద కేసు నమోదు చేసింది. మొత్తం నిందితులు A1 నుంచి A40 వరకు ఉన్నారు. వీరు కాకుండా కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. రెండు ఛార్జ్‌షీట్‌లు (సప్లిమెంటరీ) దాఖలయ్యాయి. 9 కంపెనీలు ఈ స్కాంలో ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు.
ఈ కేసులో ప్రధాన మైన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు 6 మంది ఉన్నారు. ప్రధాన అధికారులు కూడా ఆరు మంది ఉన్నారు. దాదాపు వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. చాలా మందికి యాంటిసిపేటరీ బెయిల్ ను కోర్టు తిరస్కరించింది. కొందరు రెగ్యులర్ బెయిల్ కోసం అప్పీల్ చేస్తున్నారు. వాటిని కూడా కోర్టు డినై చేసింది.
నిందితుడు ఎంపీ మిథున్ రెడ్డి
కేసు ఎలా నమోదైందంటే...
ముఖేష్ కుమార్ మీనా (Principal Secretary, Revenue/Excise) సెప్టెంబర్ 2024లో CIDకి ఫిర్యాదు చేశారు. ఇది APSBCL కమిటీ రిపోర్ట్ ఆధారంగా జరిగింది.
SIT (Vijayawada CP SV Rajasekhar Babu నేతృత్వంలో), ED దర్యాప్తు జరుగుతోంది. మనీ ట్రయిల్ ట్రేస్ చేశారు. (రూ. 11 కోట్లు సీజ్, అసెట్స్ అటాచ్) విసిల్‌బ్లోయర్ అలర్ట్‌లు, KPMG పాత్ర (పాలసీ డిజైన్‌లో) వెలుగులోకి వచ్చాయి. రెండు ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసినా సప్లిమెంటరీ చార్జ్ షీట్ వేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ క్రూషియల్ స్టేజ్‌లో ఉందని చెప్పొచ్చు. ఇంకా అరెస్ట్‌లు జరిగే అవకాశం కూడా ఉందని సిట్ పోలీసులు చెబుతున్నారు. YSRCP రాజకీయ ప్రతీకారం అని ఆరోపిస్తోంది.
ప్రధాన నిందితుల వివరాలు
కేటగరీ | పేరు | రోల్/పదవి | అరెస్ట్ స్థితి | బెయిల్ స్థితి | జైలు/ఇతర వివరాలు |
రాజకీయ నాయకులు | YS Jagan Mohan Reddy | మాజీ CM (YSRCP) | అరెస్ట్ కాలేదు | N/A | ఆరోపణలు ఉన్నాయి, కానీ ఫార్మల్ ఛార్జ్ లేదు. |
V Vijayasai Reddy | మాజీ Rajya Sabha MP (YSRCP) | అరెస్ట్ కాలేదు | N/A | కిక్‌బ్యాక్‌లలో పాత్ర ఆరోపణ. | |
PV Midhun Reddy | MP, Rajampet (YSRCP) | అరెస్ట్ కాలేదు | N/A | లిక్కర్ సిండికేట్‌లో పాత్ర. | |
Sajjala Sridhar Reddy (A6) | YSRCP లీడర్, SPY Agro MD | అరెస్ట్ అయ్యారు (ఏప్రిల్ 26, 2025) | బెయిల్ డినై (పెండింగ్) | జైలులో ఉన్నారు, మీడియేషన్ పాత్ర. | |
K Narayanaswamy | మాజీ Deputy CM (YSRCP) | అరెస్ట్ కాలేదు | N/A | పాలసీ మార్పులలో పాత్ర, SIT విచారణ. | |
Chevireddy Bhaskar Reddy | మాజీ MLA (YSRCP) | అరెస్ట్ అయ్యారు | N/A | జైలులో ఉన్నారు. | |
అధికారులు | K Dhanunjaya Reddy (A31) | మాజీ IAS, Secretary to CM | అరెస్ట్ అయ్యారు (మే 2025) | ఆంటిసిపేటరీ బెయిల్ డినై (HC & SC) | జైలులో ఉన్నారు, కస్టడీల్ ఇంటరాగేషన్. |
P Krishna Mohan Reddy (A32) | మాజీ OSD to CM | అరెస్ట్ అయ్యారు (మే 2025) | ఆంటిసిపేటరీ బెయిల్ డినై (HC & SC) | జైలులో ఉన్నారు, అసెట్స్ కొనుగోలు ఆరోపణ. | |
Vasudeva Reddy (A2) | మాజీ MD, APSBCL | అరెస్ట్ కాలేదు | ఆంటిసిపేటరీ బెయిల్ డినై | అప్రూవర్ కావాలని ప్రయత్నం, కానీ తిరస్కరణ. | |
D Venkata Satya Prasad (A3) | Special Officer, Excise | అరెస్ట్ కాలేదు | ఆంటిసిపేటరీ బెయిల్ డినై | అప్రూవర్ ప్రయత్నం తిరస్కరణ. | |
PSR Anjaneyulu | మాజీ Intelligence Chief (IPS) | అరెస్ట్ కాలేదు | N/A | సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో నమోదు, కాల్ రికార్డులు. | |
Rajat Bhargava | IAS, Special Chief Secretary | అరెస్ట్ కాలేదు | N/A | విసిల్‌బ్లోయర్ (ఆరోపణలు అలర్ట్ చేశారు). | |
ఇతరులు | Raj Kesireddy (A1) | మాజీ IT Advisor to CM | అరెస్ట్ అయ్యారు (ఏప్రిల్ 21, 2025) | బెయిల్ డినై | జైలులో ఉన్నారు, కింగ్‌పిన్ ఆరోపణ, ల్యాండ్ కొనుగోలు. |
Govindappa Balaji (A33) | Director, Bharathi Cement | అరెస్ట్ అయ్యారు (మే 13, 2025) | ఆంటిసిపేటరీ బెయిల్ డినై (HC & SC) | జైలులో ఉన్నారు, కిక్‌బ్యాక్ డిస్ట్రిబ్యూషన్. | |
Booneti Chanakya (A8) | అసోసియేట్ | అరెస్ట్ అయ్యారు | బెయిల్ పెండింగ్ | జైలులో ఉన్నారు, సేఫ్ హౌస్ ఉపయోగం. | |
P Deelip | PA to Raj Kesireddy | అరెస్ట్ అయ్యారు | N/A | 2025 ఆగస్ట్ 28న ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. | |
Varun Purushotham (A40) | అసోసియేట్ | అరెస్ట్ అయ్యారు (జూలై 2025) | N/A | జైలులో ఉన్నారు, కన్ఫెషన్ ద్వారా రూ.11 కోట్లు సీజ్. | |
Venkatesh Naidu | అసోసియేట్ (Chevireddy అసోసియేట్) | అరెస్ట్ కాలేదు | N/A | క్యాష్ కౌంటింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. | |
Rohit Reddy, Savireddy, Srilatha, Nithin Krishna, Rupak Jadh | షెల్ కంపెనీల డైరెక్టర్లు | అరెస్ట్ కాలేదు | N/A | రైడ్‌లు జరిగాయి. |