అభ్యుదయ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

అరసం పెద్దాయనగా పెనుగొండను చెబుతుంటారు. 45 ఏళ్లుగా అరసంలో పని చేస్తున్నారు. శ్రామిక పక్షపాతిగాను పేరు తెచ్చుకున్నారు.

By :  Admin
Update: 2024-12-18 10:44 GMT

గుంటూరుకు చెందిన ప్రముఖ రచయిత, అభ్యుదయ కవి, అరసం జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకున్నారు. ఆయన రచించిన ‘దీపిక అభ్యుదయ వాస్య సంపుటి’కి గాను పెనుగొండ లక్ష్మీనారాయణ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన అభ్యుదయ రచయితల సంఘానికి ప్రతినిధిగా ఉన్నారు. ఏళ్ల తరబడి అభ్యుదయ రచయితల సంఘా(అరసం)నికి సేవలు అందిస్తున్నారు. 1972 నుంచి అభ్యుదయ రచయితల సంఘానికి సేవలు అందించిన ఆయన కార్యకర్తగాను, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఎనిదేళ్ల పాటు అరసం జాతీయ కార్యదర్శిగా ఉన్న పెనుగొండ 2023లో అభ్యుదయ రచయితల సంఘానికి జాతీయ అధ్యక్షుడిగాను ఎన్నికయ్యారు. అలా జాతీయ స్థాయిలో ఎన్నికైన తొలి తెలుగు సాహితీ వేత్తగా పెనుగొండ లక్ష్మీనారాయణ గుర్తింపు పొందారు.

1972లో సమిధ అనే కవితతో పెనుగొండ తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. 1954 అక్టోబరు 24న గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం చెరువుకొమ్ముపాలెంలో ఆయన జన్మించారు. బీఏ, బీఎల్‌ చదివారు. తర్వాత న్యాయవాది వత్తిని చేపట్టారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన విధిత తోపాటు అనేక(సాహిత్య వ్యాసాల సంపుటి), రేపటిలోకి(కవిత్వం) వంటి రచనలు చేశారు. బల్గేరియా కవితా సంకలనం, అరాజకీయం కవితా సంకలనం, గుంటూరు కథలు, కథాస్రవంతి కథా సంపుటాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. తెలుగు భాషా పురస్కారంతో పాటు సుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం, మిలీనియం లాయర్‌ పురస్కారం తదితర అవార్డులను అందుకున్నారు.

Tags:    

Similar News