Gandikota | గండికోట రహస్యం: వైష్ణవిది పరువు హత్యా?

ఆమె స్నేహితుడి పాత్ర ఏమిటి? కుటుంబ సభ్యుల కథనం ఏమిటి?;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-16 08:18 GMT

కడప జిల్లా జమ్మలమడుగులోని పర్యాటక ప్రదేశం గండికోట వద్ద ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్యకు దారితీసిన రహస్యాన్ని పోలీసులు గంటల వ్యవధిలోనే తేల్చినట్లు సమాచారం.

"పరువు కోసం వైష్ణవిని హత్య జరిగి ఉంటుంది" అనే మాటలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా అదే సందేహిస్తున్నారు.
గండికోట వద్ద వైష్ణవిని కిరాతకంగా హత్య చేయడంలో ఎవరి పాత్ర ఉంది? అనే విషయంలో పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
సంఘటన ఇది
సోమవారం ఉదయం
వైష్ణవితో కలిసి ద్విచక్ర వాహనంలో లోకేష్ వెళ్లడం గండికోట చెక్ పోస్టు వద్ద సీసీ టీవీలో రికార్డు అయింది.
కొన్ని గంటల తరువాత లోకేష్ ఒక్కడే రావడం కూడా నమోదైంది.
మధ్యాహ్నం తరువాతే వైష్ణవి హత్య జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది. మధ్యాహ్నం తరువాత వైష్ణవి ప్రాణం పోయినట్లు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యు నిర్ధారించారు. అంటే..
ఈ నివేదిక ఆధారంగా అన్ని విషయాలు కూపీ లాగిన పోలీసులు నిందితుల వివరాలు కొన్ని గంటల్లో వెల్లడించే అవకాశం ఉంది.
గండికోట వద్ద విద్యార్థిని వైష్ణవి హత్య ఘటన సమాచారం తెలియగానే ప్రొద్దుటూరు డీఎస్పీ భవానీ కూడా పరిశీలించారు. కడప ఎస్పీ ఈజీ. అశోక్ కుమార్ కూడా స్వయంగా పరిస్ధితిని సమీక్షించారు.
ఈ ఘటన వెనుకకు వెళితే..
కడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలోని హనుమనగుత్తి గ్రామానికి చెందిన వైష్ణవి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. లోకేష్ అనే యువకుడితో కలిసి ఆమె జమ్మలమడుగు సమీపంలోని గండికోట పర్యాటక కేంద్రం వద్దకు ఆదివారం ఉదయం బైక్లో వెళ్ళింది. ఈ దృశ్యం గండికోట వద్ద ఉన్న చెక్ పోస్ట్ సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయింది. ఆ తర్వాత లోకేష్ ఒంటరిగా తిరిగి రావడం కూడా అదే సీసీటీవీలో నమోదయింది.
తల్లిదండ్రుల ఫిర్యాదు
సోమవారం సాయంత్రం అయింది. రాత్రి అయినప్పటికీ వైష్ణవి ఇంటికి చేరలేదు.
"మా కూతురు కనిపించడం లేదు" అని వైష్ణవి తల్లిదండ్రులు ప్రొద్దుటూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళవారం ఉదయం గండికోట వద్ద ఓ బాలిక మృతదేహం పడి ఉందనే సమాచారం పోలీసులకు అందడం. అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు వైష్ణవిని గుర్తించడంతో మిస్సింగ్ అయిన బాలిక ఎవరనేది తేలిపోయింది.
గండికోట పర్యాటక ప్రదేశానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్పోస్ట్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.
"వైష్ణవిని బైక్ లో తీసుకువెళుతున్న దృశ్యం. కొద్దిసేపటికి ఒంటరిగా రావడం" సీసీటీవీలో కనిపించింది.
దీంతో పోలీసులు లోకేష్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు.
"వైష్ణవిని తాను హత్య చేయలేదు. మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో నేను ఒంటరిగా తిరిగి వచ్చాను" అని లోకేష్ పోలీసులకు చెప్పారని తెలిసింది.
అసలు కథ ఏమిటి?
హత్యకు గురైన హర్షిణి, ఆమెతో ప్రేమలో ఉన్న లోకేష్ ఎర్రగుంట్ల మండలం హనమనగుత్తి గ్రామమే. వారిద్దరిదీ పక్కపక్క ఇల్లే అని తెలిసింది. వారిద్దరూ బలిజ (కాపు) సామాజిక వర్గానికి చెందిన వారే అని కూడా సమాచారం. ఇదిలావుంటే,
పొరుగునే ఉన్న లోకేష్ తో చనువుగా ఉండడంపై వైష్ణవిని తల్లిదండ్రులు, సోదరుడు సురేంద్ర మందలించిన ఫలితం కనిపించలేదని తెలిసింది.
కూతురు వైష్ణవి చదువు కోసం తల్లిదండ్రులు తమ నివాసాన్ని ప్రొద్దుటూరుకు మార్చారు. అయినా లోకేష్ తో వైష్ణవి స్నేహం మాత్రం మానుకోలేదని తెలుస్తోంది.
గండికోటలో ఏమి జరిగింది
ఆదివారం కావడంతో వైష్ణవిని వెంట తీసుకున్న లోకేష్ బైక్ లో గండికోటకు బయలుదేరాడు.
ఉదయం 8. 38 గంటలకు గండికోట చెక్పోస్ట్ దాటారు.
ఉదయం 10. 37 గంటలకు లోకేష్ ఒక్కడే బైక్లో తిరిగి రావడం సీసీటీవీ లో రికార్డు అయింది. ఇద్దరూ వెళ్లి.. ఒకరే తిరిగి రావడం. వైష్ణవి హత్యకు గురైన సంఘటనపై పోలీసులు విచారణ చేశారు.
గండికోట వద్ద తిరుగుతుండగా, లోకేష్ కు ఓ ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం.
"వైష్ణవి సంబంధీకులు నీకోసం గాలిస్తున్నారు" అని హెచ్చరించినట్లు లోకేష్ పోలీసు లకు వివరించినట్లు తెలిసింది. ఫోన్ కాల్ సమాచారం లోకేష్ చెప్పడంతో,
"మా వాళ్ళు వస్తే నేను చూసుకుంటా. నీవు వెళ్ళిపో" అని వైష్ణవి సూచనతోనే ఒంటరిగా వచ్చేసానని లోకేష్ జరిగిన సంఘటనను పోలీసులకు వివరించినట్లు సమాచారం.
వైష్ణవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు
"మధ్యాహ్నం 12 గంటల వరకు సజీవంగానే ఉంది" అని నిర్ధారించినట్లు సమాచారం. అంటే మధ్యాహ్నం తరువాతే ఆమె హత్యకు గురైనట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైనట్లు తెలిసింది.
ఎవరు చంపారు?
గండికోట వద్ద వైష్ణవి ఒంటరిగా ఉండడం ఆమె సోదరుడు సురేంద్ర గమనించాడు. అతని వెంట ఇంకొంతమంది కూడా స్నేహితులు ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.
"వైష్ణవి వివస్త్రగా శవమై" తెలింది. లోకేష్ తో పాటు వైష్ణవి కుటుంబీకులను కూడా పోలీసులు చేసిప విచారణలో ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలిందని తెలిసింది.
గండికోటకు సమీపంలో ముళ్ళ పొదల మధ్య ఉన్న వైష్ణవి మృతదేహాన్ని ఎవరు గుర్తించారు? పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు? అనేది దర్యాప్తు అధికారులు వెల్లడిస్తేనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో వివస్త్రగా ఉన్న వైష్ణవి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
"నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి" అని కూడా డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఘటనా స్థలం వద్ద వైష్ణవి బాబాయ్ సోదరుడు సురేంద్ర కూడా మీడియాకు కొన్ని విషయాలు చెప్పాడు.
"లోకేష్ తో సన్నిహితంగా ఉండడంపై మా చెల్లి వైష్ణవిని మందలించాం" అని సురేంద్ర చెప్పాడు.
"మా చెల్లిని బాగా చదివించుకోవాలని, మా బాబాయ్ కుటుంబాన్ని కూడా ప్రొద్దుటూరుకు మార్చారు" అనే విషయాన్ని కూడా సురేంద్ర వెల్లడించాడు.
ఈ ఎపిసోడ్ మొత్తంలో కొన్ని గంటల పాటు హై డ్రామా నడిపించినట్లు కనిపిస్తోంది. చెల్లి మృతి ఘటన సురేంద్రకు తెలుసా? తెలిసినా తల్లిదండ్రులకు చెప్పలేదా? అనే ప్రశ్నల చిక్కుముడులు పోలీసులు వెల్లడించే అంశాలతో వీడే అవకాశం ఉంది.

Similar News