కడప: అరటిపండు ఆశచూపి చిన్నారిని చిదిమేసి..
మూడేళ్ల బాలికపై ఓ రాక్షసుడు అఘాయిత్యం చేశాడు. పాపను చంపి, పొదల్లో పడేసిన దారుణ ఘటన కడప జిల్లాలో జరిగింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-23 17:48 GMT
పెళ్లి మండపం వద్ద ఆడుకుంటున్న మూడేళ్ల పాపను ఎత్తుకెళ్లి, అత్యాచారం చేశాడు. ఆ పాపను చింపేసి, పొదల్లో పడేసిన దారుణ ఘటన కడప జిల్లాలో శుక్రవారం జరిగింది.
బంధువుల ఇంటి పెళ్లి కావడంతో ప్రొద్దుటూరు పట్టణం అమృత్ నగర్ కు చెందిన దంపతులు నుంచి మూడేళ్ల కూతురితో జమ్మలమడుగు తాలూకా మైలవరం మండలం కంబాలదిన్నెకు వెళ్లారు. పెళ్లి ఇంట్లో సందడిగా ఉంది. బందువులతో హడావిడిగా ఉంది. ఆ మూడేళ్ల బాలిక ఇంటి బయట పందిరి కింద ఆడుకుంటోంది. ఓ కామాంధుడు అరటి పండు ఇస్తానని ఆశ చూపించాడు. అమాయకంగా దగ్గరికి వెళ్లిన ఆ పాపను ఎత్తుకుని ఊరిబయటికి వెళ్లాడు. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రాణాలు వదలిన పాప మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేసి, వెళ్లిపోయాడు.
తమ బిడ్డ ఎంతకీ కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. చివరికి ముళ్లపొదల్లో శతమై పడి ఉన్న బిడ్డను చూసిన తల్లిదండ్రులు గుండెలు పగులేలా రోదించారు.
గ్రామస్తులు ఎట్టకేలకు పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారానికి పాలపడింది జమ్మలమడుగు మండలం మోరగుడికి చెందిన రామతుల్లా (26)గా గుర్తించారు. అభం శుభం తెలియని చిన్నారిపై ఘోరానికి పాల్పడిన నిందితుడిని తక్షణమే ఎన్ కౌంటర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న మైలవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి వెళ్లిన దంపతులు మూడేళ్ల కూతురిపై జరిగిన ఈ దాష్టీకంతో కంబాలదిన్నె శోకసముద్రంలో మునిగిపోయింది. కూతురిని పోగొట్టుకున్న దంపతుల వేదన వర్ణనాతీతంగా ఉంది.