kadapa | గండికోట వద్ద పొద్దుటూరు అమ్మాయి హత్య

లోకేష్ అనే ఇంటర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-15 06:20 GMT
గండికోట వద్ద విద్యార్థిని మృతదేహం లభించిన ప్రదేశం.

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పర్యాటక కేంద్రం గండికోట వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది.

ప్రొద్దుటూరు కు చెందిన ఇంటర్ విద్యార్థిని హత్యకు హత్యకు గురైనట్లు గుర్తించారు. ఆ విద్యార్థిని నగ్నంగా చేయడమే కాకుండా, చున్నీ గొంతుకు బిగించి, చింపేసినట్టు తెలిసింది. ఆ బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లిన సహచర విద్యార్థి ఒంటరిగా తిరిగి రావడం సీసీటీవీ లో నమోదయింది. దీని ఆధారంగా ప్రొద్దుటూరుకే చెందిన లోకేష్ అనే ఇంటర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

"హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని మృతదేహం నగ్నంగా ఉండడం చూసి గ్రామస్తులు కూడా కంటతడి పెట్టారు"


గండికోట సమీపంలో పూర్తి నగ్నంగా ఉన్న విద్యార్థిని మృతదేహం సమీప ప్రాంతవాసుల ను కన్నీటి పర్యంతానికి గురిచేసింది.

గండికోట వద్ద సోమవారం జరిగిన ఈ సంఘటన విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగు చూసింది.
"ఘటనా స్థలంలో ఉన్నాం. కేసు దర్యాప్తు చేస్తున్నాం" అని జమ్మలమడుగు సీఐ లింగప్ప 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
ఈ సంఘటన వివరాల్లోకి వెళితే
ప్రొద్దుటూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో వైష్ణవిది ఎర్రగుంట్ల మండలం హనుమాన్ దుర్తి గ్రామం. ఇదే కాలేజీలో లోకేష్ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
నమ్మించి తీసుకుని వెళ్లి..
ఆదివారం సెలవు కావడంతో వైష్ణవితో కలిసి ద్విచక్రవాహనంలో లోకేష్ జమ్మలమడుగు సమీపంలో ఉన్న గండికోట పర్యాటక కేంద్రం వద్దకు తీసుకువెళ్లాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ప్రదేశంలో వారిద్దరు తిరిగారని చెబుతున్నారు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు కానీ లోకేష్ ఒంటరిగా బైక్ పై తిరిగి వచ్చాడు. ఈ రెండు దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.. ఇదిలా ఉంటే,
తల్లిదండ్రుల ఫిర్యాదు
ఆదివారం రాత్రి అయినా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా సానుకూలంగా స్పందించి వైష్ణవిది మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా దిగారు.
గండికోట వద్ద ముళ్ళపొదల్లో ఓ అమ్మాయి నగ్నంగా ఉన్న మృతదేహం ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.
చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం వైష్ణవిధి గానే గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చారు. నగ్నంగా పడి ఉన్న కూతురి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలు అవిసిపోయేలా రోదించారు.
గండికోట వద్ద ముళ్లపదలో పడి ఉన్న వైష్ణవి మృతదేహం చూసిన స్థానికులు కూడా కన్నీరు పెట్టారు. ఎక్కడో దూరంగా పడేసి ఉండడం కూడా గమనించారు. ఈ అమ్మాయిని లోకేష్ చంపేశాడా? ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News