కడప: దక్షిణాది 'మక్కా' యాత్రలో సింగర్ మనో..

రాయలసీమలో మరో అజ్మీర్ గా కడప దర్గాకు పేరు. ప్రముఖ సింగర్ మనో ఈ దర్గాను సందర్శనకు వచ్చారు.

Update: 2024-11-13 06:30 GMT

కడప నగరంలోని ఈ అమీన్ పీర్ దర్గా దేశంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ముస్లింలు మక్కా తర్వాత, కడప అమీన్ పీర్ దర్గాకు అంతటి ప్రాధాన్యత ఇస్తారు. సినీ నేపథ్య గాయకుడు మనో కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మైనారిటీ శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ హర్షవర్ధన్ కూడా వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి దర్గా పెద్దలు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.


కడపలో ఉన్న ఈ అమీన్ పీర్ దర్గాను కేవలం ముస్లింలే కాకుండా హిందువులు కూడా ఎక్కువ దర్శిస్తుంటారు. అందులో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ దర్గాకు ఏడాదికి ఒకసారైనా వచ్చి ఫాతేహా (ప్రార్థన) సమర్పిస్తుంటారు. కులం మతాలకు అతీతంగా ఈ దర్గాలో ప్రార్థనలు చేయడం కోసం దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ప్రముఖులు హాజరవుతుంటారు. ఆ కోవఫలో తరచూ సినీ సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ వస్తుంటారు. అంతకుముందు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ దర్గాను దర్శంచుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. 

కడప నగరం నకాష్ వీధి సమీపంలో ఈ దర్గా ఉంది దీనికి పెద్ద దర్గా లేక ఆమేన్ పేరు దర్గా అనేది అందరూ పిలిచే పేరు. దక్షిణ భారతదేశంలో ఈ దర్గా అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ దర్గాను దక్షిణ భారతదేశపు అజ్మీర్, అరదశంలోని మరో మక్కాగా భావించి ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ దర్గాకు చారిత్రిక నేపథ్యం కూడా ఉంది.

ఈ దర్గా మొదటి సూఫీ (మూలపురుషుడు) హజరత్ పాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మద్ హుసేని శిశువుల్ ఖాద్రి నాయక్ ఏ రసూల్. ఈయన ప్రవక్త మహమ్మద్ వంశీయుడు. నిరాడంబరమైన ఈయన కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణం నుంచి 1683లో కడపకు చేరుకున్నాడు అనేది చరిత్ర. 1716లో అమౌంట్ దర్గాలో ఆయన జీవ సమాధి అయినట్లు అక్కడి మతి పెద్దలు చెబుతారు. ఈయన సూక్తి తత్వాలు బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందినట్లు. వివరిస్తారు.
ఆయన శిష్యుడైన నేక్ నామ్ ఖాన్ కడపను పాలించారు. మొదటి సూఫీని తన గురువుగా భావించి జీవ సమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్ద దర్గా అనేది అక్కడి పెద్దలు వివరిస్తున్నారు.
కడపను పాలించిన నేక్ నామ్ ఖాన్ కొడుకుల్లో ఇద్దరు వారిలో పెద్దకొడుకు అరిఫుల్ల హుస్సేన్ కడప పీఠాధిపతిగా మరో కొడుకు అహ్మద్ హుసేని నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు. కడప పీఠాధిపతుల మరణానంతరం పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగుతున్నారు ఈ పరంపరలో ప్రస్తుతం 11 వ పీఠాధిపతిగా అరిఫ్లహసేని ఉన్నారు.

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన కడప దర్గా (ఆస్థానయే మఘుమ్ ఇలాహి) ను ప్రముఖ నేపథ్య గాయకుడు మనో తన భార్య జమీలతో కలిసి దర్శించుకున్నారు. దర్గా వద్ద ఆయనకు సంప్రదాయ ప్రకారం మత పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం అమీన్ పీర్ జీవ సమాధి అయిన గుమజ్ వద్దా చాదర్ సమర్పించి సంప్రదాయ ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సింగర్ మనో కు ఆమెన్ పీర్ దర్గా విశిష్టత చారిత్రక నేపథ్యాన్ని అక్కడి పెద్దలు వివరించారు.
మైనారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ..

కడప అమీన్ పీర్ దర్గాను మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ హర్షవర్ధన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు దర్గా వద్ద నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం దర్గా విశిష్టతను  హర్షవర్ధన్తె లుసుకున్నారు. దర్గా ఉరుసు ఉత్సవాల ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు.
Tags:    

Similar News