దేశం కోసం పెట్టిన పార్టీ జనసేన
సేనతో సేనాని తొలిరోజు సమీక్షలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చర్చించిన అంశాలను ఆ పార్టీ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మీడియాకు వివరించారు.;
By : Vijayakumar Garika
Update: 2025-08-28 15:56 GMT
కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిరోజు జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో సూచించారు. 2014 ఎన్నికల్లో చవిచూసిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2024 ఎన్నికల్లో కూటమిలో చేరి టీడీపీకి బేషరతుగా మద్దతునివ్వాల్సి వచ్చిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవన్ స్పష్టం చేశారు. తమకు దేశం ముఖ్యమని, పార్టీని దేశం కోసమే స్థాపించామని స్పష్టం చేశారు. ఇంకా ఈ సమీక్షా సమావేశంలో చర్చించిన అంశాలను ఆ పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ గురువారం రాత్రి మీడియా సమావేశంలో తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే?
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పవన్
‘ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక 2014లో ఒంటరిగా నిలదొక్కుకోలేక అప్పటి ఎన్నికల్లో కూటమికి బేషరతుగా సపోర్టు ఇచ్చాం. 2024లోనూ ఎలాగైనా రాష్ట్రాన్ని నిలబెట్టాలని 21 సీట్లకు అంగీకరించాం. నూరు శాతం విజయం సాధించాం. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన బలోపేతానికి కష్టపడి పనిచేయాలన్న బాధ్యతను మా అధినేత పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ కోసం వారానికోసారి కేటాయించాలని సూచించారు. సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా పవన్ ఒక్కొక్కరితో మాట్లాడారు. గాజువాకకు చెందిన సురేష్ అనే కార్యకర్త ఒక సలహా ఇచ్చాడు. ఈసారి మీరు (పవన్) వచ్చినప్పుడు కార్యకర్త ఇంట్లో బస చేయాలని సూచించాడు. దానికి పవన్ సానుకూలంగా స్పందించారు. కూటమిని ఎలా నిర్వహించాలన్న దానిపై పవన్ దశ, దిశ నిర్దేశించారు. జనసేన కలకాలం ఉంటుంది. మనకు దేశం ముఖ్యం.. దేశం కోసమే జనసేన పార్టీని స్థాపించామని సమీక్షలో పవన్ కల్యాణ్ చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షిస్తూ వారు మన్ముందు ఎలా పనిచేయాలో సూచించారు’ అని విజయ్‌కుమార్ వివరించారు.
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పవన్
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను జనసేనే ఆపింది..
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా జనసేన పార్టీయే ఆపిందని ఎమ్మెల్యే విజయకుమార్ చెప్పారు. ‘ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన వెంటనే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో మాట్లాడి ఆపివేయించారు. ప్లాంట్‌కు సొంత గనులు ఇమ్మన్నాం. వైజాగ్ స్టీల్‌ప్లాంటుకు పైప్‌లైన్ అడిగాం. వైసీపీ ప్రైవేటీకరణ ఆపకుండా భూములు లే అవుట్ వేయాలని ప్రయత్నించింది. వైసీపీ టైంలో ప్రైవేటీకరణ చేస్తామంటే మేం వ్యతిరేకించాం. తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన ప్లాంటు.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లమంటే అప్పటి సీఎం జగన్ తీసుకెళ్లలేదు. అఖిలపక్షాన్ని మేం ఇప్పడు తీసుకెళ్లడానికి కంగారు లేదు. తీర్మానం చేయడానికి ఇంకా సమయం ఉంది. కొత్తగా తీర్మానం చేయాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు.
మీడియాతో మాట్లాడుతున్న జనసేన ఎమ్మెల్యే విజయ్‌కుమార్
రాంగ్ ట్రాక్‌లో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు..
సుగాలి ప్రీతి తల్లిదండ్రులు రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నారు. ఆమె హత్యకు గురైనప్పుడు పవన్ కల్యాణ్ రెండు లక్షల మందితో కర్నూలు వెళ్లి ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేశాం. కర్నూలు సమీపంలో ఆమె తల్లిదండ్రులకు ఐదెకరాల భూమి ఇచ్చాం. భార్యాభర్తలకు ప్రభుత్వోద్యోగాలు ఇప్పించాం. కేసు సీబీఐకీ చేరకుండా అప్పటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పటికీ హోంమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తాం. సుగాలి ప్రీతి తల్లిదండ్రులు రాంVŠ ట్రాక్‌లో పడడం వల్లే వారు ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం.’ అని జనసేన ఎమ్మెల్యే విజయ్‌కుమార్ చెప్పారు.