'ఇజ్రాయిల్‌ యుద్ధం ఆపాలి, ఆక్రమిత భూభాగాన్ని పాలస్తీనాకు ఇవ్వాలి'

ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై ఈ 70 సంవత్సరాల కాలంలో ఆరు యుద్ధాలు చేసింది. వందలసార్లు బాంబుల దాడులు చేసింది. 85 శా. పాలస్తీనా భూభాగం ఆక్రమించుకుంది.

By :  Admin
Update: 2024-11-16 13:37 GMT

ఇజ్రేల్ పాలస్తీనా మీద  చేస్తున్నది పూర్తి రాజకీయ ఆర్థిక యుద్ధని   దీనిని మతయుద్ధంగా చూడరాదని   ప్రతి ఒక్కరూ ఇజ్రాయిల్‌ చేస్తున్న దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనా దేశానికి మద్దతు ఇవ్వాలని ప్రముఖ రచయిత ఎన్ వేణుగోపాల్ పిలుపు నిచ్చారు.

 ఈ రోజు కడప సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలో కడప జడ్పీహాల్లో జరిగిన పాలస్తీనా సంఘీభావ సభకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ప్రపంచ దేశాలన్నీ పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో దాడులకు హత్యలకు విధ్వంసానికి కారణమవుతున్న ఇజ్రాయిల్‌ దేశానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం ప్రకటిస్తున్నాయని మానవత విలువల్ని చాటుకుంటున్నాయని వేణు అన్నారు.

పాలస్తీనా గాజా ప్రాంతంలో నరమేధం జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 43 వేల మందిని చంపబడ్డారు. అందులో 17,000 మంది పసిపిల్లలే ఉన్నారన్నారు. లక్షల ఇల్లు నేలకూలడంతో వేలకోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఇజ్రాయిల్‌ ఈ యుద్ధాన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన కోరారు. చరిత్రలో ఎప్పటినుంచో పాలస్తీనా దేశం ఉంది. అయితే 1948లో 25 శాతం ఉన్న యూదుల కోసం అమెరికా బ్రిటన్‌ ఐక్యరాజ్యసమితి కుట్ర చేసే ఏర్పర్చిన దేశమే ఇశ్రాయేలీయుల దేశం. అలా ఏర్పడిన ఇజ్రాయిల్‌ దేశం పాలస్తీనా దేశంపై ఈ 50, 70 సంవత్సరాల కాలంలో ఆరుసార్లు యుద్ధాలు, వందలసార్లు బాంబుల దాడి చేసి ఆ దేశాన్ని సుమారు 85% మేర క్రమించుకున్నదన్నారు.

వందల వేల సంవత్సరాల కాలం నుంచి నివాసాలు ఉన్న లక్షలాదిమంది పాలస్తీనా అరబ్బులను తరిమివేసి, గాజా వెస్ట్‌ బ్యాంక్‌ అనే రెండు చిన్న ప్రాంతాలను మాత్రమే వదిలి తమ చుట్టూ ఉన్న భూభాగాన్ని మొత్తం ఆక్రమించేసి తమ దేశాన్ని స్థాపించుకున్నారు ఇజ్రాయేలులు. రవాణాకు ఆహారానికి వైద్యానికి తమ మీదనే ఆధార పడవలసిన పరిస్థితిని కల్పించారు ఇజ్రాయిల్‌ యూదులు. అమెరికా కుట్రతోనే ఇశ్రాయేలీయులు ఇంతటి దారుణానికి పూనుకున్నారని ఇజ్రాయేలును అక్కడనుండి వెళ్ళిపోవాలని వందలసార్లు ఐక్యరాజ్యసమితి సూచించింది. అయినా ఇజ్రాయేలీయులు లెక్క చేయడం లేదు. జనరల్‌ అసెంబ్లీలో తీర్మానాలు పాస్‌ అయ్యాయి. 193 సభ్య దేశాలలో 150 దేశాలు పాలస్తినాకు మద్దతిస్తున్నాయని తెలిపారు.

చాలామంది దీన్ని ఇజ్రాయిల్‌ అరబ్బుల సమస్య గా, ఇజ్రాయెల్‌ పాలస్తీనా సమస్య గా, ఇజ్రాయిల్‌ గాజా మీద దాడి చేస్తున్న సమస్య గా, దీనిని మత యుద్ధంగా చూస్తున్నారని అన్నారు. యూదులు ముస్లింల మీద దాడి చేస్తున్నారు. కానీ ముస్లింలు అనాగరికులని, హింస వాదులని మూర్ఖులని వారి మీద దాడి చేయాల్సిందేనని ముస్లింల మీద సామ్రాజ్యవాదం కల్పిస్తున్న ప్రచారం చేస్తోంది. దీన్ని మతయుద్ధంగా చూస్తున్నారని అన్నారు. అమెరికా బ్రిటన్‌లు చమురు బావుల కోసమే ఇశ్రాయేలీయులను పాలస్తీనా ప్రజలకు పక్కలో బల్లెంలా వాడుకుంటున్నారన్నారు. 


ఫోరం అధ్యక్షులు డాక్టర్‌ రాజా వెంగళ రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఒక సంవత్సరం పైగా ఇజ్రాయిల్‌ పాలిస్తీనాపై అమానుష యుద్ధం చేస్తోంది. దీన్ని హమాస్‌ దాడికి ప్రతిగా చేస్తున్నామని ఇజ్రాయిల్‌ చెప్పుకుంటోందని అన్నారు.

వాస్తవానికి పాలస్తీనా దేశం చేస్తున్న డిమాండ్‌ దాదాపు గత మూడు దశాబ్దాలుగా నడుస్తున్న చరిత్ర. ఐక్యరాజ్యసమితి పాలిస్తీనాను గుర్తించింది వారి న్యాయమైన డిమాండ్‌ ను నెరవేర్చాలని ఇజ్రాయిల్‌కు ఎన్నోసార్లుచెబుతోందని అయినా వారు వినకుండా పాలస్తీనా ప్రజలపై దాడులు చేస్తూ ఆ దేశ భూభాగాన్ని అది ఆక్రమించుకుంటూ వస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలోనే హమాస్‌ దాడి జరిగిందన్నారు. హమాస్‌ చేసింది తప్పే. ఆ తర్వాత ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడి అమాయక ప్రజలను చంపేస్తోంది. ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న మానవతావాదులందరినీ కలవరపెడుతోంది. వారు తమ యుద్ధాన్ని విరమణ చేయాలని ఆయన కోరారు. 

Delete Edit


సిపిఎం పార్టీ నాయకులు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ పాలసీనపై చేస్తున్న యుద్ధం ఈనాడు ప్రపంచ శాంతికాముకులందరూ ఖండిస్తున్నారని, సిపిఎం పార్టీ పాలిస్తీనాకు పూర్తి మద్దతు ఇస్తోందని అన్నారు. ఇజ్రాయిల్‌కు అండగా అమెరికా నిలబడటం వల్లనే ఈరోజు అది బరితెగించి యుద్ధాలు చేస్తోందని, వారు టెక్నాలజీని ఉపయోగించి ఇతర దేశాల పైన పెత్తనం సాగిస్తోందని దీన్ని అందరూ ఖండించాలని అన్నారు. సిపిఐ నాయకులు చంద్ర మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాలిస్తీనాకు మద్దతిస్తున్నాయి. కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. కారణం దీనికి అంతటికి అమెరికాయే. అమెరికా ఇప్పుడు సంక్షోభం లోకిపోతూ ఉందని, అందువల్ల వారు ఆ యుద్ధానికి మద్దతు ఇక ఆపేస్తే యుద్ధం ఆగిపోవచ్చు. కానీ పాలస్తీనా సమస్య మాత్రం పరిష్కారం కాకుండా ఉంటుందని అన్నారు. అందువల్ల పాలస్తీనా సమస్యను ఐక్యరాజ్యసమితి చెప్పే ఒప్పందం ప్రకారం ఇజ్రాయిల్‌ ఆమోదించాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నాయకులు పిళ్లా కుమారస్వామి, కడప సిటిజన్‌ ఫోరం అధ్యక్షులు డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రవిశంకర్‌ రెడ్డి మడకలం ప్రసాద్‌ బాబు ఖాన్, బుద్ధిష్ట్‌ కల్చరల్‌ సొసైటీ నాయకులు డా. భాస్కర్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు, పెన్షనర్ల సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి, ఎల్‌ఐసి యూనియన్‌ నాయకులు రఘునాథరెడ్డి, సిఐటియు నాయకులు శ్రీనివాసులు రెడ్డి, సిపిఎం కడప పట్టణ నాయకులు రామ్మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
Tags:    

Similar News