CM's surprise | తిరుపతిలో ఇంత మంచి పని జరుగుతున్నదా ?
వ్యర్థాల నిర్వహణలో దేశానికి రాష్ట్రం ఆదర్శంగా తీర్చిద్దాలని సీఎం చంద్రబాబు సూచన.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-19 08:54 GMT
తిరుపతి సమీపంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ చూసిన సీఎం చంద్రబాబు ఆశ్చర్య వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లాలో ఒకరోజు పర్యటనకు శనివారం మధ్యాహ్నం చేరుకున్నారు. విశాఖ తరహాలో తీర్చిదిద్దడం ద్వారా వేస్ట్ మేనేజిమెంట్ నిర్వహణలో దేశంలో రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు కర్తవ్య బోధ చేశారు. వ్యర్ధనీటిని కూడా వృథా కానివ్వకుండా, సింగపూర్ తరహాలో సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి చేరుకున్న సీఎం ఎన్. చంద్రబాబు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఏర్పాటుచేసిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వివరాలను సీఎం చంద్రబాబుకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ మౌర్య వివరించారు.
డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్( ప్లాట్ ను ), బయో మితనైజేషన్ గ్యాస్ ప్లాంట్, భవన నిర్వహణ వ్యర్థాల సందర్శించారు. మధ్యాహ్నం 11:45 నిమిషాలకు ప్రారంభమైన ఆయన పరిశీలన మధ్యాహ్నం 1.30 గంటల వరకు వరకు జరిగింది.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఇక్కడి ప్లాంట్లోని పరిస్థితిని వివరించారు.
నాకే తెలియలేదే..
తూకివాకం వద్ద డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును పరిశీలిస్తూ, సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
"ఇంత మంచి ప్లాంట్ ఉన్న విషయం నాకే తెలియదు. నా దృష్టికి రాలేదు" అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"విశాఖలో నిర్వహిస్తున్న ఇదే తరహా ప్లాంటు నాకు తెలుసు. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. తిరుపతిలో అందుకు దీటుగా వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహించడం" లో అధికారుల కృషి అభినందనీయం అని అధికారులపై ప్రశంసలు కురిపించారు.
తిరుపతి సహా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్ధాలను వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సీఎం ఎన్ చంద్రబాబు అధికారులకు సూచన చేశారు. తిరుపతిలోని హోటల్లో నుంచి సేకరిస్తున్న 40 నుంచి 50 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేస్తున్నట్లు కమిషనర్ మౌర్య వివరించారు. 290 ఎకరాల్లో నిర్వహిస్తున్న ప్లాంట్ వివరాలు తెలుసుకున్న చంద్రబాబు సంతృప్తి చెందారు. వ్యర్థాలను ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించిన సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.
"రీసైకిలింగ్ కోసం వచ్చిన ఘన వ్యర్ధాలను వినియోగించుకున్న తర్వాత వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు తరలించండి" అని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
సీఎం చంద్రబాబు ఏమి సూచించారంటే..
"విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్ధాలను సద్వినియోగం చేసేలా చూడండి" అని సీఎం చంద్రబాబు సూచించారు. ఇళ్ల నుంచి, మార్కెట్ నుంచి సేకరించిన కూరగాయల వ్యర్ధాలను ఎంత మేర ఎరువులగా తయారు చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యర్ధాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలా చూడాలని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సూచించారు. సీఎం వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, జిల్లా ఇన్చార్జి మంత్రి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్, మునిసిపల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్య, ఎస్పీ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీకలెక్టర్ సందీప్ రఘు వాన్షి కూడా ఉన్నారు.