Congress and BRS tough fight|గట్టిపోటీ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యేనా ?
ఒకసర్వే ప్రకారం ఉపఎన్నికలంటు వస్తే కాంగ్రెస-బీఆర్ఎస్ చెరిసగం సీట్లలో గెలుస్తాయి;
తెలంగాణలో ఉపఎన్నికలు జరిగితే పరిస్దితి ఎలాగుంటుంది ? అన్నీసీట్లను గెలుచుకోవాలని రేవంత్ రెడ్డి(Revanth) నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ గట్టిపట్టుదలతో ఉంది. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు జనాలు గట్టిగా బుద్ధిచెప్పటానికి సిద్ధంగా ఉన్నారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎ(BRS)స్ పదేపదే చెబుతోంది. ఎన్నికలుజరిగే అన్నీసీట్లను తామేగెలుచుకుంటామని బల్లగుద్దకుండా చెబుతోంది. మధ్యలో బీజేపీ(BJP) పాత్ర ఏమిటి ? ఇదంతా చదవటానికి అయోమయంగా ఉంది. ఒకసర్వే ప్రకారం ఉపఎన్నికలంటు వస్తే కాంగ్రెస-బీఆర్ఎస్ చెరిసగం సీట్లలో గెలుస్తాయి. మరో రెండుసీట్లలో రెండుపార్టీల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుందని సీ-ప్యాక్ సర్వేలో తేలింది.
తెలంగాణ(Telangana)లో ఇపుడు ఎన్నికలుఏమిటని అనుకుంటున్నారా ? అదే ఉపఎన్నికలగురించే చెప్పేది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్(Congress) లోకి పదిమంది ఎంఎల్ఏలు ఫిరాయించిన(BRS MLAs defection) విషయంతెలిసిందే. ఆపదినియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao) చాలాకాలంగా ఆశలుపెట్టుకున్నారు. తొందరలోనే పదినియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయమని, ఆ నియోజకవర్గాలన్నింటినీ తమపార్టీయే స్వీప్ చేసేస్తుందని కేటీఆర్, హరీష్ తదితరులు పదేపదే చెబుతున్నారు.
ఉపఎన్నికలు జరుగుతాయనే ఆశకు హేతువు ఏమిటంటే ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేస్తారని గంపెడంత ఆశలుపెట్టుకున్నారు. సుప్రింకోర్టు ఆదేశాలతో స్పీకర్ కు ఫిరాయింపులపై అనర్హత వేటువేయక వేరే దారి లేదని ఇప్పటికి చాలాసార్లుచెప్పారు. అనర్హత వేటుపడిన తర్వాత పదినియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని, అప్పుడు వాటన్నింటినీ తమపార్టీయే గెలుచుకుంటుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే కేటీఆర్ చెబుతున్నట్లుగా ఫిరాయింపులపై అనర్హత వేటుపడుతుందా ? అనర్హత వేటువేయాలని స్పీకర్ ను సుప్రింకోర్టు ఆదేశిస్తుందా ? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఇపుడు సుప్రింకోర్టులో వేసిన పిటీషన్నే గతంలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ హైకోర్టు(Telangana High court)లో వేశారు. వీళ్ళ పిటీషన్ను విచారించిన హైకోర్టు కేసును కొట్టేసింది. శాసనవ్యవస్ధకు సంబంధించి స్పీకర్అధికారాల్లో న్యాయవ్యవస్ధ జొరబడేందుకులేదని తేల్చిచెప్పేసింది. ఫిరాయింపులపై పలనా సమయంలోగా అనర్హత వేటువేయాలని స్పీకర్ ను ఆదేశించే అధికారాలు కోర్టుకు లేదని హైకోర్టు చెప్పింది.
హైకోర్టుదెబ్బకు మైండ్ బ్లాంక్ అయిన కేటీఆర్ తదితరులు కొద్దిరోజుల తర్వాత అదే పిటీషన్ను మళ్ళీ సుప్రింకోర్టు(Supreme court)లో దాఖలుచేశారు. ఇపుడా పిటీషన్ను విచారించే సుప్రింకోర్టు తమఆశలకు అనుగుణంగా తీర్పిస్తుందని, ఫిరాయింపులపై అనర్హత వేటుఖాయమని, అప్పుడు ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్ చాలా కలలే కంటున్నారు. ఉపఎన్నికలు వస్తాయో రాదో తెలీదు. అయితే ఉపఎన్నికలు వస్తే జనాలమూడ్ ఎలాగుంటుందనే విషయమై ఫిరాయింపుల పదిఅసెంబ్లీ నియోజకవర్గాల్లో జనాభిప్రాయాలపై సీ-ప్యాక్ అనే సర్వేసంస్ధ ఒక సర్వే నిర్వహించింది. దానిప్రకారం మొత్తంపదిసీట్లలో కాంగ్రెస్-బీఆర్ఎస్ చెరి నాలుగుసీట్లలో గెలుస్తుందని తేలింది. మిగిలిన రెండుసీట్లలో పై రెండుపార్టీల మధ్య హోరాహోరీ పోటీ తప్పదని సర్వే తేల్చింది. పదిసీట్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ పంచుకుంటే 2028 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని కలలుకంటున్న బీజేపీ పరిస్ధితి ఏమిటి ? ఏమిటో సర్వే సంస్ధే చెప్పాలి.
సర్వే ప్రకారం భద్రాచలం, గద్వాల్, పటాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని సీ-ప్యాక్ తేల్చేసింది. అలాగే చేవెళ్ళ, స్టేషన్ ఘన్ పూర్, బాన్స్ వాడ, జగిత్యాల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ తప్పదని, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని సర్వేలో తేలింది. సర్వే అంచనా ఫలితాలను సంస్ధ తన ట్విట్టర్లో కూడా పోస్టుచేసింది. తమ సర్వేలో బీజేపీని సంస్ధ పట్టించుకోలేదా ? లేకపోతే జనాలే బీజేపీని పట్టించుకోలేదా అన్న విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అయితే ఈ సర్వే అంచనా ఫలితాలను కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. సదరు సర్వేఅంచనాను బీఆర్ఎస్ పార్టీ నేతలు చేయించుకున్నారని ఎద్దేవాచేస్తున్నారు. సర్వేపేరుతో జనాల మైండ్ సెట్ ను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. తమపార్టీ అధికారంలోకి రాగానే రైతురుణమాఫీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు, 6గ్యారెంటీలను అమల్లోకితెచ్చినవిషయాన్ని హస్తంపార్టీనేతలు గుర్తుచేస్తున్నారు. మరికొన్ని హామీల అమలకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది కాబట్టి ఉపఎన్నికలంటు జరిగితే మొత్తం అన్నీసీట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుందని అంటున్నారు.
ఉపఎన్నికలు కేటీఆర్ కల
ఫిరాయింపుల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగుతాయని కేటీఆర్ కలలుకంటున్నట్లు కాంగ్రెస్ నేతలు ఎద్దేవాచేస్తున్నారు. ఇదే విషయమై ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానంనాగేందర్ మాట్లాడుతు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఫిరాయింపులకు పాల్పడినపుడు ఉపఎన్నికలు వచ్చాయా ? అని ఎదురు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపు ఎంఎల్ఏలు రాజీనామాలు చేయని విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్(KCR) 18 మంది ఎంఎల్ఏలను ఫిరాయింపుల ద్వారా లాక్కున్నపుడు నైతికత, ప్రజాస్వామ్యం, చట్టాలు కేటీఆర్ కు ఎందుకు గుర్తురాలేదని నిలదీశారు. ఫిరాయింపులపై కోర్టు అనర్హత వేటువేస్తుందన్నది కేటీఆర్ కలమాత్రమే అని స్పష్టంగా చెప్పారు.