ఔను వారిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేయసి, ప్రియుడు ఎలా సజీవ దహనం అయ్యారు?
కర్నూలు జిల్లాలో ఇద్దరు అనుమానాస్పద మృతి.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-18 04:59 GMT
ఓ ఇంటిలో ప్రేయసితో పాటు ప్రియుడు కూడా కాలిన స్థితిలో శవాలై తేలారు. ఇద్దరి మృతదేహాలపై కాలిన గాయాలు ఉండడంతో సందేహాస్పదంగా మారిందని పోలీసులు కూడా చెబుతున్నారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సందేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. డీఎస్పీ శ్రీనివాస్ తో పాటు డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రియురాలు అశ్విని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో అడ్డుకోబోయిన ప్రయుడు ఫరీద్ గాయాలతో మరణించినట్టు పోలీసులు సందేహిస్తున్నారు.
"అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం" అని డోన్ పట్టణ సిఐలు ఇంతియాజ్ బాషా, రాకేష్ తెలిపారు. ఫోరెన్సిక్వి విభాగం నిపుణులు కూడా ఇంటిలో ఆధారాలు సేకరిస్తున్నారని వారు వివరించారు. ఈ వివరాల్లోకి వెళ్తే..
డోన్ పట్టణంలోని రాజ్ టాకీస్ వెనుక భాగంలో అశ్విని (35) కుటుంబం నివాసముంటుంది. పాతపేటకు చెందిన ఫరీద్ (52) తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అశ్విని నివాసానికి వచ్చిన ఫరీద్ ఇద్దరూ కాలిన గాయాలతో శవమై కనిపించారు.
కుటుంబాల కథ
డోంట్ సమీపంలోని చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన అశ్వినికి కోడుమూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రవితో వివాహమైంది. మొదట వీరి కుటుంబం డోన్ పట్టణం పాతపేటలో నివాసం ఉండేది. అప్పుడే ఫరీద్ప తో పరిచయం ఏర్పడినట్లు సందేహిస్తున్నారు. కొన్ని నెలల కిందట రాజ్ టాకీస్ వెనుక వైపు ఉన్న వీధిలో ఇల్లు కొనుగోలు చేసిన అశ్విని, రవి దంపతులు అక్కడికి నివాసం మార్చారు.
ఏం జరిగింది
డోన్ పట్టణం రాజు టాకీస్ కు వెనకవైపు ఉన్న వీధిలో నివాసం ఉంటున్న అశ్విని ఇంటికి ఫరీద్ సోమవారం సాయంత్రం వచ్చాడని భావిస్తున్నారు. అదే సమయంలో అశ్విని కూతురు పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లితో పాటు మరో వ్యక్తి మృతి చెంది ఉండడం చూసి కేకలు వేసినట్లు తెలిసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి రావడమే కాకుండా అశ్విని కుటుంబీకులు కూడా అక్కడికి చేరుకున్నారు.
ఇంటిలో అశ్విని తోపాటు ఫరీద్ శరీరంపై కూడా కారిన గాయాలు ఉండడం, ఇద్దరూ ప్రాణాలు కోల్పోయి పడి ఉండడం గమనించారు. అశ్విని భర్త రవి దుకాణంలో ఉన్నట్లు సమాచారం.
ఈ విషయం తెలియగానే పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా సంఘటనా స్థలానికి వచ్చారు. ఇంట్లో పరిసరాలను పరిశీలించిన ఆయన ఉన్నతాధికారులతో పాటు ఫోరెన్సిక్ విభాగం అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో డిఎస్పి శ్రీనివాస్ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అశ్వని, ఫరీద్ మధ్య ఘర్షణ జరిగిందా? లేకుంటే మరేదైనా కారణం ఉందా? ఎలా మరణించారు? అనే విషయంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రేయసి అశ్విని తో పాటు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఫరీద్ మృతదేహాలు పడి ఉన్న ఆ ఇంటిలో పెట్రోల్ వాసన వస్తున్నట్లు కూడా పోలీసులు గ్రహించారని తెలిసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.