సనాతనమంటే కోర్టులకు భయమా? పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

విపక్ష వైసీపీనే కాదు. హిందూ ఇతరులను కూడా పవన్ కళ్యాణ్ ఏకిపారేశారు. పదునైన మాటలతో ఆయన కోర్టులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-03 16:39 GMT

సనాతన ధర్మాన్ని అజెండాగా ఎత్తుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీతో పాటు, మతాలను ప్రధానంగా న్యాయస్థానాలను కూడా వదలకుండా కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలు కొందరికే చుట్టాలుగా మారాయిని అభివర్ణించారు. "సనాతన ధర్మం పాటించే వారిపై న్యాయస్థానాలు నిర్ధాక్షణంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్నాయి. "అన్య ధర్మాలను పాటించే వారిపై మానవత్వం చూపిస్తున్నాయి" అని పవన్ కళ్యాణ్ కోర్టులపై ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు.


ప్రాయశ్చిత్త దీక్ష విరమించడానికి తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటన సాగించారు. అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత గురువారం రాత్రి తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీకి సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ -2024 ప్రకటించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, కోర్టుల, చట్టాలు, న్యాయవ్యవస్థ అంటే తనకు అప్పారమైన గౌరవం విశ్వాసం విధేయత ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే
"సనాతన ధర్మాన్ని దూషించే వారికే కోర్టులు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి" అని తీవ్ర వ్యాఖ్య చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో జరుగుతున్న వ్యవహారాన్ని ఆయన ప్రస్తావిస్తూ, కాలాతీతం చేస్తున్న అంటూ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, తప్పులు చేసే రక్షణ కల్పిస్తున్నాయని అన్నారు.
" సనాతనం ఒక వైరస్ అని ఓ యువ నేత అభివర్ణించారు" అని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఆ నాయకుడు ఎవరైతే పేరు మాత్రం చెప్పలేదు. ముస్లిం మతస్తులకు ఏదైనా అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన వెంటనే న్యాయస్థానాలు స్పందిస్తాయి. వారికి అండగా నిలబడతాయి. సనాతన ధర్మానికి దెబ్బ తగిలిందని వెళితే మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ వ్యవహారం చూస్తే.. "అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్లకు కంచాలు" అనే దుస్థితి దాపరించింది. "ఇప్పుడు ఆకులు కూడా లేవు" అని తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు.
పదవి.. జీవితం పోయినా సరే..

"సనాతన ధర్మంపై దాడి జరిగితే నేను చూస్తూ ఊరుకోను. నా పదవీ నా జీవితం, రాజకీయ జీవితం పోయిన బాధపడను. నేను ఎప్పుడూ ధర్మం తప్పలేదు" అని పవన్ కళ్యాణ్ తగేసి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న తీరును పరిశీలిస్తే సుడో సెక్యులరిస్టులు ఎక్కువయ్యారు. అని కూడా ఆయన నిందించారు. సనాతన ధర్మానికి రంగు వివక్షత లేదనే విషయాన్ని గుర్తించాలని ఆయన హితోపలికారు.
ప్రశ్నలు సంధించిన కల్యాణ్

సెక్యులరిజం అంటే రెండు రకాలు. "మర్యాద ఇవ్వడం ఎంతో తీసుకోవడం" కూడా అలాగే ఉండాలి. సనాతన ధర్మం విషయంలో కూడా ఇది పాటించాలి. లేదంటే... ఆ ధర్మ రక్షణలో నేను ముందు ఉంటా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంటే యుద్ధానికి కూడా సిద్ధం అని చెప్పకనే చెప్పారు. రాముడిని తిట్టిన బాధపడకూడదు. దీనిని ప్రశ్నిస్తే మేము మతోన్మాదులం అవుతామా? అని ఆయన నిలదీశారు. ఏమి మాట్లాడినా మాకు బాధపడే హక్కు కూడా లేదా? అన్యమతస్తులను వెనకేసుకొ రావడం సెక్యులరిజం అవుతుందా? అని కూడా ఆయన ప్రశ్నల పరంపరను కొనసాగించారు.
"హైందవ సనాతన ధర్మం కాపాడిందుకే నేను వచ్చా. ఆ దాడుల నుంచి దేశాన్ని కాపాడడంలో ఏమాత్రం భయపడను అని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. సనాతన ధర్మంపై మాట్లాడితే మేము మతోన్మాదులమవుతామా. సెక్యుల దృష్టిలో ముసుగులో ఉన్న వారికి ఇదే నా ప్రశ్న అని ఆయన వ్యాఖ్యానించారు. సెక్యులరిజం అంటే దూషించడమేనా అని కూడా ఆయన నిలదీశారు. "వారాహి అమ్మవారి చేతుల్లో ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో.. ఏ సందర్భంలో ఆమె ఎలా శిక్ష వేయడానికి ఆయుధాలను వినియోగిస్తారో.. నేను కూడా అదే తీరులో ఉంటా" అని పవన్ కళ్యాణ్ వి స్పష్టంగా ప్రకటించారు.
రెండు అంశాల మధ్య ప్రసంగం
దాదాపు రెండు గంటల పాటు సాగిన పవన్ కళ్యాణ్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంతం మతం, హిందుత్వం మధ్య పరిభ్రమించాయి. జనసేన పార్టీ ఆవిర్భావం, ఆ లక్ష్యానికి దూరంగా జరిగినట్లే ఆయన మాట నడత స్పష్టంగా కనిపిస్తోంది.
హిందుత్వ అజెండాగా పనిచేసే ఆర్ఎస్ఎస్ , విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ ఆ తర్వాత ఆ సంస్థల స్వరంగా బీజేపీ నడక సాగుతుంది. ఆ సంస్థల విషయాన్ని దేశంలో బిజెపి నాయకత్వం పనిచేస్తుందనేది సామాన్యుడు కూడా తెలిసిన విషయమే.
వారిని మించి..
సనాతన ధర్మం, హైందవంపై పని చేసే ఆ సంస్థలను, అందులో పురుడు పోసుకున్న నాయకులను అధిగమించిన తీరులో జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు కనిపించింది. పూర్తిగా ఆయన హిందుత్వం అజెండాతో ముందుకు సాగాలని విధానాన్ని విస్పష్టంగా తన మాటలు రూపంలో తేట తెల్లం చేశారు.

మత ఉద్రిక్తతలకు బీజం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హోదా బాధ్యతను మరిచినట్లు ఉందని సిపిఎం రాష్ట్ర నాయకుడు గంగారం మురళి వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభ తీరును మురళి 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధితో విశ్లేషించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు "మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉంది" అని కందారపు మురళి అభిప్రాయపడ్డారు. తిరుమల లడ్డు కల్తీ, ఈ విషయంపై కోర్టులో జరుగుతున్న విచారణ ప్రాసెస్ తప్పు పట్టే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగానే ఉన్నాయి. కోర్టులు కూడా భయం ఉందని చెప్పడం ద్వారా పెద్ద విమర్శ చేశారు" అని మురళి అన్నారు." పవన్ కళ్యాణ్ బిజెపి ఆయుధంగా మారినట్లు స్పష్టమవుతోంది. మనువాద సిద్ధాంతాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఊరేగేందుకు బయలుదేరారు" అని మురళి అభిప్రాయపడ్డారు.

డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక బాధ్యత వహిస్తునాను అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. రాష్ట్రంలో ఏమి జరుగుతోంది. తిరుపతికి వచ్చిన ఆయన ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏమి చేస్తారనే విషయంలో ఒక్క ముక్క చెప్పలేదు. ఇది దారుణమైన విషయం అని గందారపు మురళి ఆక్షేపణ చెప్పారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యవహారం తీరు ఆందోళన కలిగించేదిగానే ఉంది. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలి అని ఆయన సూచన చేశారు.


Tags:    

Similar News