ఏపీలో భారీగా ఐపీఎస్‌ బదిలీలు–14 జిల్లాలకు ఎస్పీలు వీరే

ప్రస్తుతం ఉన్న వారినే 12 జిల్లాలకు ఎస్పీలుగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.;

Update: 2025-09-13 12:27 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ బదిలీలు చేపట్టింది. జిల్లాలకు ఎస్సీలను నియమించడంలో మిశ్రమ విధానాన్ని అనుసరించింది. ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులను బదిలీలు చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌ అధికారులను బదిలీలు చేసింది. 14 జిల్లాలకు నూతన ఎస్పీలను నియమించింది. ఏడు జిల్లాలకు నూతన ఎస్పీలను నియమించిన ప్రభుత్వం..మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీలు చేసింది. మరో 12 జిల్లాలకు ప్రస్తుతం ఉన్న ఐపీఎస్‌ అధికారులనే ఎస్పీలుగా కొనసాగించింది. ఆ మేరకు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా నియమితులైన ఎస్పీలు
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ – రాహుల్‌ మీనా
బాపట్ల జిల్లా ఎస్పీ – ఉమామహేశ్వర్‌
కృష్ణా జిల్లా ఎస్పీ – విద్యాసాగర్‌ నాయుడు
నెల్లూరు జిల్లా ఎస్పీ – అజితా వేజెండ్ల
తిరుపతి జిల్లా ఎస్పీ – సుబ్బారాయుడు
అన్నమయ్య జిల్లా ఎస్పీ – ధీరజ్‌ కుసుగిలి
కడప జిల్లా – నచికేత్‌
నంద్యాల జిల్లా ఎస్పీ – సునీల్‌ షెరాన్‌

ఇతర జిల్లాల నుంచి బదిలీ అయిన ఎస్పీలు

విజయనగరం జిల్లా ఎస్పీగా – ఏఆర్‌ దామోదర్‌
కృష్ణా జల్లా ఎస్పీగా – విద్యాసాగర్‌ నాయుడు
గుంటూరు జిల్లా ఎస్పీగా – వకుల్‌ జిందాల్‌
పల్నాడు జిల్లా ఎస్పీగా – డి కృష్ణారావు
ప్రకాశం జిల్లా ఎస్పీగా – హర్షవర్థన్‌రాజు
చిత్తూరు జిల్లా ఎస్పీగా – తుషార్‌ డూడి
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా – సతీష్‌ కుమార్‌
మరి కొన్ని జిల్లాలకు ఉన్న వారినే ఎస్సీలుగా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్‌ గోదావరి, వెస్ట్‌ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలను మార్పులు చేర్చులు చేయకుండా యథాతధంగా కొనసాగుతారని శనివారం సాయంత్రం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరో వైపు ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులను బదిలీలు చేసిన ప్రభుత్వం శనివారం నాడు ఐపీఎస్‌ అధికారులను బదిలీలు చేపట్టింది. తొలుత 11 ఐఏఎస్‌ అధికారులను బదిలీలు చేపట్టింది. తర్వాత 11 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులను బదిలీలు చేసింది. అనంతరం 12 జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించింది. తాజాగా 14 జిల్లాల ఎస్పీలను నయమించింది. ఇలా కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ అధికారుల బదిలీల ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది.
Tags:    

Similar News