సంక్రాంతి వేళ ఏపీలో ఐపీఎస్‌లు బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.;
By : Admin
Update: 2025-01-13 12:55 GMT
సంక్రాంతి సంబురాలు జరుపుకుంటున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు డిపార్ట్‌మెంట్‌ను షాక్‌కు గురిచేసింది. ఏకంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఐదుగురు ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం గ్రేహౌండ్స్‌లో అస్సాల్ట్ కమాండర్లుగా పని చేస్తున్నారు. వీరంతా 2021, 2022 బ్యాచ్‌కు చెందిన అధికారులే.
2021వ బ్యాచ్‌కు చెందిన నవజ్యోతి మిశ్రాను చింతపల్లి ఏఎస్పీగా బదిలీ చేసింది. 2022 బ్యాచ్‌కు చెందిన మందా జావళి ఆల్ఫోన్స్‌ను నంద్యాల ఏఎస్పీగా ట్రాన్స్‌ఫర్ చేసింది. 2022 బ్యాచ్‌కు చెందిన మనోజ్ రామ్ నాథ్‌హెగ్డేను రాజంపేట ఏఎస్పీగాను, 2022 బ్యాచ్‌కు చెందిన దేవరాజ్ మనీష్‌ను కాకినాడ ఏఎస్పీగాను, 2022 బ్యాచ్‌కు చెందిన రోహిత్ కుమార్ చౌదరిని తాడిపత్రి ఏఎస్పీగా బదిలీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.