అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది కరెక్టే
అన్నయ్య చిరంజీవి ఒక్కడే ముసుగు వేసుకొని తన సినిమాలను చూసేవారు. నేను కూడా అలానే నా సినిమాలను థియేటర్‌లకు వెళ్లి చూసాను.
By : Admin
Update: 2024-12-30 09:29 GMT
అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దానిపైన మాట్లాడని పవన్ కల్యాణ్ సోమవారం స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసింది కరెక్టే అని అన్నారు. అలా చేయక పోతే రేవంత్‌రెడ్డి మీద ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందని, సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి స్పందించారని అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడని, కింది స్థాయి నుంచి ఎదిగిన నేతని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు రేవంత్‌రెడ్డి ఎంతో మేలు చేశారని అన్నారు. బెనిఫిట్ షోలకు అవకాశాలిచ్చారని, రేవంత్‌రెడ్డి సహకారంతోనే సినిమాల కలక్షెన్లు పెరిగాయన్నారు. సలార్‌తో పాటు పుష్ప2 వంటి సినిమాలు భారీగా కలెక్షన్లు కురిపించాయన్నారు. అంతేకాMýంండా పుష్ప2 చిత్రానికి సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా సహకరించారని తెలిపారు. రేవంత్‌రెడ్డికి రాంచరణ్, అల్లు అర్జున్‌లు చిన్న నాటి నుంచి తెలుసన్నారు. అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్ నాయకుడే అని అన్నారు. అయితే కొన్ని సార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయన్నారు.
మంగళగిరిలో సోమవారం మీడియా చిట్ చాట్‌లో పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టం అందరికీ సమానమే అని, ఇలాంటి సంఘటనల్లో పోలీసులను తప్పపట్టనని చెప్పారు. అల్లు అర్జున్, ఆయన టీమ్ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని అన్నారు. తొక్కిసలాటలో రేవతి మరణించడం తనను తీవ్రంగా కలచి వేసిందన్న పవన్ కల్యాణ్, బాధిత కుటంబాన్ని అల్లు అర్జున్ కానీ, ఆయన తపున ఎవరో ఒకరు ముందుగానే వెళ్లి పరామర్శించి ఉంటే చాలా బాగుండేదని అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఉంటో బాగుండేదన్నారు. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగి పోయిందని విచారం వ్యక్తం చేసుంటే బాగుండేదన్నారు. అల్లు అర్జున్ మొత్తం ఎపిసోడ్‌లో మానవత్వ దృక్పథం లోపించిందన్నారు. సంఘటన జరిగిన తర్వాత రేవతి కుటంబాన్ని పరామర్శించి, భరోసా ఇవ్వక పోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చందన్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ముందు వెనుక ఏమి జరిగిందో తెలియదని, కానీ తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్‌లో ఉందన్నారు. భద్రత గురించి ఆలోచించే ముసుగేసుకొని చిరంజీవి ఒక్కరే తన సినిమాలను చూసే వారని, తాను కూడా అలానే తన సినిమాలను చూసినట్లు చెప్పారు. సినిమా అంటే ఒక టీమ్‌ని, అందరి భాగస్వామ్యం ఉండాలని, కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారని, ఇది కరెక్టు కాదని తాను అభిప్రాయపడ్డారు.