ఆంధ్రలో కాపు ప్రాబల్యం ఎక్కువ ఉన్న స్థానాలు ఎన్నంటే!

రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న సామాజిక వర్గాల్లో కాపు కమ్యూనిటీ ఒకటి. కానీ రాజకీయ పరంగా మాత్రం వారు ఎందుకు రాణించలేకున్నారు.

Update: 2024-04-21 11:54 GMT

ఆంధ్ర ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి ఉన్న బలం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వీరి సంఖ్య బలం బాగానే ఉంది. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతి సారి కూడా కాపు సామాజిక వర్గం హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఏ పార్టీ నుంచి ఎంత మంది కాపు నేతలు ఎన్నికల బరిలో నిలబడుతున్నారు అన్న విషయంపైనే ఎక్కువగా చర్చలు జరుగుతుంటాయి. తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని కాపు సంఘాలు నాయకులు కూడా అనేక సార్లు ఆందోళనల బాట పట్టిన దాఖలాలు ఉన్నాయి. ఎన్నికలను ఇంతలా ప్రభావితం చేస్తున్న ఈ కాపు సామాజిక వర్గానికి రాష్ట్రం ఎంత బలం ఉంది. వీరి ఓట్లతో రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నింటిని కైవసం చేసుకోవచ్చో తెలుసా. అసలు వీరే అధికంగా ఉన్న నియోజకవర్గాలెన్ని మరి ఈ వివరాలు తెలుసుకుందామా..

27శాతం ఓటర్లు కాపులే!

రాష్ట్రంలోని ఓటర్లలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారే 27 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోని 112 నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఉన్న సామాజిక వర్గాల్లో కాపు లేదా బలిజలు టాప్ 3లో ఉన్నారు. వాటిలో 93 నియెజకవర్గాలు జనరల్‌వే. ఇవిలా ఉంటే మొత్తం 67 నియోజకవర్గాల్లో కాపు సామాజిక ఓటర్లే అత్యధికం. ఈ నియోజకవర్గాల్లో కాపుల ఓటర్ల అన్ని ఓట్లను సాధిస్తే ఆ నేతదే విజయం అవుతుంది. ఇదిలా ఉంటే మరో 26 నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఉన్న సామాజిక వర్గాల్లో వీరు రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 19 నియోజకవర్గాల్లో వీరు మూడో స్థానంలో ఉన్నారు. దీనిని బట్టి చూస్తేనే రాష్ట్రంలో కాపుల బలం ఎంతో అర్థమవుతుంది.

రాజకీయంగా వెనకబడిందీ వీరే

ఓటర్ల సంఖ్య పరంగా ప్రథమ స్థానంలో ఉన్న కాపు సామాజిక వర్గం రాజకీయ పరంగా మాత్రం వెకబడే ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో రాణిస్తున్నప్పటికీ రాజకీయాల్లో వీరు సాధించింది ఏమీ లేదు. ఏదైనా సాధించారా అన్న గీతకు కూడా వీరు ఆమడ దూరంలో ఉన్నారు. ఎన్నికల పరంగా వీరు సాధించిన విజయాలూ ఏమీ లేవు. ఇదిలా ఉంటే ఈ 119 వర్గాల్లో రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల బరిలో ఉన్న ఏ నాయకుడి గెలుపునైనా శాసించే స్థాయిలో మాత్రం కాపులదే పైచేయి. మరోమాటలో చెప్పాలంటే ఒక రాజకీయ నేత గెలుపోటములను వీరు నిర్ణయిస్తారు. అయినప్పటికీ రాజకీయాల్లో వీరికి అంత ప్రాధాన్యత లభించట్లేదని చెప్పొచ్చు. వీరి సంఖ్యాపరంగా చూసుకుంటే 93 జనరల్ నియోజకవర్గాల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసే స్థాయిలో వీరు ఉండాల్సి ఉంది. కానీ పరిస్థితి అలా లేదు. అందుకు తాజాగా 2024 ఎన్నికలకు కూటమి, వైసీపీ ఈ సామాజిక వర్గం నేతలకు ఇచ్చిన స్థానాలు నిదర్శనం.

కాపులకు ఎన్ని స్థానాలంటే

2024 ఎన్నికల్లో కూటమి కాపు నేతలకు 24 స్థానాల్లో అవకాశం కల్పించింది. వైసీపీ పార్టీ 30 చోట్ల బలిజ సామాజిక వర్గం నేతలను బరిలోకి దింపాయి. వీటి ప్రకారం చూసుకుంటే దాదాపు 16 స్థానాల్లో ఇరు పార్టీల నుంచి కాపు నేతలతో తలపడనున్నారు. మిగిలి సీట్లలో ఇతర సామాజిక వర్గం నేతలతో వీరు పోటీ పడనున్నారు. ఆ మిగిలిన అన్ని స్థానాల్లో కాపు నేతలే గెలిస్తే.. రాష్ట్రంలోని 38 అసెంబ్లీ సీట్లలో కాపు సామాజిక వర్గం నేతలు గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెడతారు. వీటితో పాటుగా ఇరు పక్షాల నుంచి కాపులే పోటీ చేస్తున్న 16 సామాజిక వర్గాలు కూడా కలుస్తాయి. అక్కడ ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా కాపు సామాజిక వర్గం నేతే అధికారంలో ఉంటారు.

కాపులకు అందుకే సీట్లు ఇవ్వట్లేదా!

రాష్ట్రంలోని 67 నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లుగా కాపులే ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గం నేతలు కనీ అన్ని స్థానాల్లో కూడా పోటీలో లేరు. రాజకీయ పార్టీలు కూడా అతి కష్టం మీదు వీరికి ఒకమోస్తరుగా సీట్లు అందిస్తున్నాయి. అందుకు కాపు సామాజిక వర్గం నేతలు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. వీరు క్షేత్ర స్థాయిలో రాజకీయాలు చేయడం లేదని, నియోజవర్గ స్థాయిలో మాత్రం పారిశ్రామికవేత్తలుగానో, సుసంపన్న కుటుంబ సభ్యులుగానో వీరు కనిపిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయి నుంచి వీరు రాజకీయాల్లో కనిపించడం లేదని వారు వివరిస్తున్నారు. దానికి తోడుగా వీరు ప్రతిసారి తిరుగుబాటు చేయడం, ఒక పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీలో తమ మనుగడను చూపించకపోవడం కూడా వీరు రాజకీయంగా వెనకబడి ఉండటానికి ప్రధాన కారణాలని వారు వివరిస్తున్నారు. ఇప్పటికైనా వారు రాజకీయ చైతన్యం పొంది మసులుకుంటే రానున్న భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతారని విశ్లేషకుల అభిప్రాయం.

Tags:    

Similar News