ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.

By :  Admin
Update: 2024-11-06 10:25 GMT

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీరు చెట్టు పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. నామినేటెడ్‌ పోస్టుల్లో 34 శాతం పోస్టులు బీసీలకు అమలు చేయాలనే నిర్ణయానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కీడ్రలు, డ్రోన్, సెమీకండక్టర్, డేటా సెంటర్ల పాలసీలకు ఆమోదం తెలిపింది. ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం. ఏపీ జీఎస్టీ సవరణ బిల్లుకు అంగీకారం తెలిపింది. ఏపీ ఎక్సైజ్‌ సవరణ ఆర్డినెన్స్, ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ ఆర్డినెన్స్‌2024కు ఆమోదించింది. కుప్పం ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీని, కుప్పం హెడ్‌ క్వార్టర్‌గా నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీని కవర్‌ చేస్తూ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. పిఠాపురం ప్రధాన కేంద్రంగా పిఠాపురం ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయడానికి మంత్రి మండలి అంగీకారం తెలిపింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల్లో 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య పూర్తయిన పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.

జ్యుడీషియల్‌ అధికారుల రిటైర్మెంట్‌ వయసును 60 నుంచి 61కి పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. పల్నాడు జిల్లాలోని ఆరు మండలాలు, 92 గ్రామాలు... సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1,069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ ప్రాంతం.. బాపట్ల జిల్లాలోని ఐదు మండలాలు, 62 గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకురావడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది. విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను నేరుగా విద్యార్థుల కాలేజీల బ్యాంక్‌ అకౌంట్లకు పంపేలా నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News