డ్రగ్స్ దందాలో మీడియా అధినేతే వార్తగా మారిపోతే

ఒక మీడియా యాజమాని వారసుడు మరో అడుగు ముందుకెళ్ళి డ్రగ్స్(Drugs) దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఒక మీడియా బయటపెట్టింది.

Update: 2024-10-23 09:02 GMT

అన్నీ రంగాల్లాగానే మీడియా రంగంలో కూడా విలువలు అడుగంటిపోయాయి. ఒకపుడు మీడియా అంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పుకునే వారు. అంటే ఇపుడు కూడా చెప్పుకుంటున్నా మీడియా(Media)ను సోషల్ మీడియా(Social Media) డామినేట్ చేసేసి చాలా కాలమైంది. తప్పో, ఒప్పో సమాచారాన్ని అందించటంలో సోషల్ మీడియా ముందు మీడియా ముందు ఎందుకు పనికిరావటంలేదు. ఒకపుడు సమాజసేవే పరామర్ధంగా మీడియా అహర్నిసలు పనిచేసేది. కొద్ది సంవత్సరాలుగా పరిస్ధితి అంతా తల్లకిందులైపోయింది. స్వీయ ప్రయోజనాలే మెజారిటి మీడియా యాజమాన్యాల ప్రధాన అజెండా అయిపోయింది. చాలా మీడియా యాజమాన్యాలు ఏదో పార్టీకి కొమ్ముకాస్తు పార్టీలతోనో లేకపోతే అధినేతలతోనే అంటకాగుతున్నాయి.

పార్టీలు, అధినేతల అజెండానే తమ అజెండాగా మార్చుకుని ప్రత్యర్ధులపైన టన్నుల కొద్ది బురదచల్లేస్తున్న వైనాన్ని చూస్తున్నదే. ఈ నేపధ్యంలోనే ఒక మీడియా యాజమాన్యం మరో యాజమాన్యంపైన కేసులు పెట్టుకుని కోర్టులకు ఎక్కుతున్నాయి. ఇపుడు ఇదంతా ఎందుకంటే ఒక మీడియా యాజమాని వారసుడు మరో అడుగు ముందుకెళ్ళి డ్రగ్స్(Drugs) దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఒక మీడియా బయటపెట్టింది. మీడియా యజమాని వారసుడు డ్రగ్స్ నిందితులు, అనుమానితులతో దీర్ఘకాలంగా సంబంధాలు నెరుపుతున్నట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయట. డ్రగ్స్ వాడుతున్న 15 మందితో నిత్యం సంప్రదింపులు జరిపినట్లు పోలీసుల(Police)కు ఆధారాలతో సహా దొరికిందన్నది సదరు వార్త సారాంశం. డ్రగ్స్ వాడుతున్న ఒకడి ఫోన్(Mobile Phone) ను విశ్లేషిస్తే అందులో మీడియా యజమాని వారసుడి వ్యవహారమంతా బయటపడిందట.

వినియోగదారులకు వారసుడిగా మధ్య 2500 ఫోన్ కాల్స్ నడిచినట్లు, పదుల సంఖ్యలో ఎస్ఎంఎస్ లు నడిచినట్లు స్పష్టమైన ఆధారాలు దొరికినట్లు ఓ మీడియా మొదటిపేజీలో వార్తను ప్రచురించింది. ఆ మీడియాలోని వార్తను చదివితే సదరు యజమాని ఎవరు, వారసుడు ఎవరనే విషయం చాలామందికి తెలిసిపోతుంది. ఒకపుడు డ్రగ్స్ వినియోగదారులు లేదా అమ్మకందార్లను పోలీసులు పట్టుకున్నా చిన్నపాటి క్లాసులు, కేసులు పెట్టి వదిలేవారట. అలాంటిది ఈమధ్యనే పరిస్ధితులు మారి అమ్మకం దారులను, సరఫరాదారులను, డ్రగ్స్ దందాల్లోని కీలకవ్యక్తులపై పూర్తిగా నిఘా పెట్టారట పోలీసులు. అందుకనే దొరికినవాడిని దొరికినట్లుగా కేసుల్లో బుక్ చేసి లోపలేసేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న పోలీసులు డ్రగ్స్ దందాలో బిజీగా ఉంటున్న వాళ్ళందరిమీద నిఘా పెట్టి మరీ దొరికిచ్చుకుంటున్నారు.

ఈ పద్దతిలోనే కొందరు అనుమానితులు, మరికొందరు వినియోగదారుల మొబైల్స్ పై నిఘా పెడితే మీడియా అధిపతి వారసుడు దొరికాడట. దాంతో తీగనంతా లాగిన పోలీసులకు పెద్ద డొంకే దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు మీడియా యజమాని వారుసుడి డ్రగ్స్ సంబంధాలపై పోలీసుల దగ్గర పక్కా ఆధారాలే ఉన్నట్లుగా మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి ఈ విషయం అధికారికంగా పోలీసులు ఎప్పుడు బయటపెడతారో చూడాలి.

Tags:    

Similar News