ఐకానిక్ బ్రిడ్జి–మీకు ఏ డిజైన్ కావాలో ఓటేయండి
అమరావతిలో రాయపూడి నుంచి కృష్ణా నదికి ఆవల ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ఐదు కిమీ పొడవున ఐకానిక్ బ్రిడ్జిను నిర్మించనున్నారు.;
By : The Federal
Update: 2025-09-05 08:42 GMT
అమరావతిలో కృష్ణా నది మీద నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి ఆకృతి ఎంపికపై అభిప్రాయ సేకరణకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది. దీని కోసం ఏపీసీఆర్‌డిఏ వెబ్‌పోర్టల్‌లో ఓటింగ్ కోరింది. ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ సెలక్ట్ చేయండి, మీకు నచ్చిన డిజైన్ ఎంపిక చేసి ఓటేయండి అంటూ సీఆర్‌డిఏ అధికారులు పేర్కొన్నారు. దీనిలో నాలుగు డిజైన్లతో కూడిన నమూనా వంతెనలను ఉంచారు.
ఆప్షన్ ఒకటి కింద కూచిపూడి నృత్యంలో, హస్త ముద్రలా ఉండే, రేడియోటింగ్ కేబుల్ బ్రిడ్జి. ఇంజనీరింగ్‌ను, కళను కలగలిపి నిర్మించే బలమైన ఐకానిక్ వంతనె.
ఆప్షన్ 2 కింద.. ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లుతో మన సంస్కృతికి, అదృష్టానికి చిహ్నంగా. స్వస్తిక హస్త భంగిమలో ఉండే కూచిపూడి డ్యాన్స్ బ్రిడ్జి.
ఆప్షన్ 3 కింద.. అమరావతి లోగో A ఆకారంలో, అభయ ముద్రలో శాంతికి చిహ్నంగా ఉండే ఐకానిక్ వంతెన.
ఆప్షన్ 4 కింద.. కూచిపూడి నృత్యంలోని కపోత ముద్రలో, చేతులు ఎత్తి అభివాదం చేస్తున్నట్లు ఉండే ఐకానిక్ వంతెన.
ఈ నాలుగింటిల్లో మూడు నమూనాలు కూచిపూడి నృత్య భంగిమలను ప్రతిబింబించే విధంగా రూపొందిస్తే.. ఒకటి మాత్రం రాజధాని అమరావతి సూచికగా ఆంగ్ల అక్షరం A ఉంది.
ఓటింగ్‌లో పాల్గొనాలి అనుకున్న వాళ్లు ఏపీసీఆర్‌డిఏ వెబ్‌పోర్టల్‌లోకి ప్రవేశించిన తర్వాత తెలుగు ఇంగ్లీషు భాషల్లో ఉంటుంది. ఏ భాషనైనా ఎంచుకోవచ్చు. పూర్తి పేరు, ఫోన్ నంబర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నాలుగు ఆప్షన్స్‌లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తర్వాత క్యాప్చాను ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.