Posani | నన్ను అరెస్ట్ చేశారు రాజా.. ఐదు గంటలుగా విచారణ

ఓబులవారిపల్లె స్టేషన్లో ఉదయం 11:30 నుంచి విచారణ చేస్తున్నారు. సాయంత్రం ఐదు తర్వాత కోర్టులో హాజరు చే అవకాశం ఉంది. న్యాయ సాయం కోసం పొన్నవోలు రంగంలోకి దిగారు.;

Byline :  SSV Bhaskar Rao
Reporter :  Dinesh Gunakala
Update: 2025-02-27 10:49 GMT

రాష్ట్రంలో వైసిపి సోషల్ మీడియా వర్కర్లనే కాదు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నాయకులను కూడా పోలీసు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ కోవలో ఏపీ ఎఫ్దిసి మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నీ హైదరాబాద్లో అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తరలించారు.

హైదరాబాదులోని రాయదుర్గం లోని మై హోం భుజ అపార్ట్మెంట్ లో నటుడు పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి అరెస్టు చేసి, గురువారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చారు.
వాహనాలు మార్చి..
నటుడు పోసాని కృష్ణ మురళిని నాటకీయ పద్ధతిలో అనేక వాహనాలు మార్చి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కడప నుంచి 5 వాహనాల కాన్వాయ్ ద్వారా నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు తీసుకుని వచ్చారు. రాజంపేట నుంచి వాహనాలు మార్చిన పోలీసులు చివరికి కారులో స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
ఏపీ ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న సమయంలో పోసాని కృష్ణమురళి హైదరాబాద్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతుర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇరకాటంలో పడేసాయి. అంతటితో ఆగని పోసాని కృష్ణమురళి
సీఎం చంద్రబాబు తో పాటు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ ను తిరుగుబోతుగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు పోసాని మురళీకృష్ణ మరింత చిక్కుల్లో పడేసాయి. దీంతో రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, అందులో రైల్వే కోడూరు నియోజకవర్గ ఓబులవారిపల్లె మండలం తెనరాశి పోడుకు చెందిన జనసేన అన్నమయ్య జిల్లా కో కన్వీనర్ జోగినేని మనీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. రైల్వే కోడూరులో జనసేన నేత పగడాల మణి ఫిర్యాదు ఆధారంగా సంబేపల్లి ఎస్సై భక్తవత్సలం సారధ్యంలోని పోలీసు బృందం కృష్ణ మురళిని పోలీసు అరెస్ట్ చేశారు
నన్ను అరెస్ట్ చేశారు రాజా..
గురువారం ఉదయం 11:30
నటుడు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసిన వ్యవహారం నేపథ్యంలో రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న మీడియా ప్రతినిధులు నిరీక్షిస్తున్నారు. రాజా.. నన్ను అరెస్ట్ చేశారు రాజా అని చెబుతూ, పోసాని స్టేషన్లోకి వెళ్ళే సమయంలో మీడియా దగ్గరికి రానికుండా రోప్ పార్టీ ఏర్పాటు చేశారు.
ఉదయం 11:45
ఓబులవారిపల్లె మెడికల్ ఆఫీసర్ .. డాక్టర్ గురు మహేష్
పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకు వచ్చిన నటుడు పోసాని కృష్ణ మురళి కి స్టేషన్లోని ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
" పోసాని కృష్ణ మురళికి ఆరోగ్య స్థిరంగా ఉంది" అని నిర్ధారించారు. ఆరోగ్యపరీక్షల కోసం ఓబులవారిపల్లి phc లేదా రైల్వే కోడూరు సిఎస్సి కి పిలుచుకొని వస్తే హంగామా ఎక్కువ ఉంటుందని భావించిన పోలీసులు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లోని పోసానికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
మధ్యాహ్నం 12:30
అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఓబులపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అప్పటికే రైల్వే కోడూరు అర్బన సిఐ. పి వెంకటేశ్వర్లు, రైల్వే కోడూరు రూరల్ సీఐ హేమ సుందర్రావు, ఓబులార్ పల్లి ఎస్ఐ మహేష్ నాయుడు కలిసి పోసాని మురళీకృష్ణ ను విచారణ చేస్తున్నారు.
రంగంలోకి పున్నవోలు

సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ సోషల్ మీడియా వారియర్ల కోసం ఆ పార్టీ ప్రత్యేకంగా న్యాయ సహాయం అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు చేరుకున్నారు.
కోటి వద్ద ఉన్నవోలు మీడియాతో మాట్లాడుతూ,
"వైసిపి కార్యకర్తలు, నాయకులను రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు" అని ఆరోపించారు. అనవసరమే కేసులు పెట్టి రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ మానసిక వేదనకు గురి చేయడం దారుణమని అన్నారు. "పోసాని కృష్ణ మురళి పై దుర్మార్గంగా ఐపిసి 111 సెక్షన్ల కింద కూడా" కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా వివరించారు. దీనిపై పోరాటం సాగిస్తామని ఆయన హెచ్చరించారు.
196, 353 (2), 111 రెడ్‌విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరపూరిత కుట్రకు వాడే 111 సెక్షన్ పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. చివరికి పేకాట ఆడుతున్న ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అవకాశాలు లేకపోలేదని ఆయన పోలీసులపై వ్యంగ్యోక్తి విసిరారు.
"ఒక వ్యక్తిపై వివిధ ప్రాంతాలలో అనేక కేసులు నమోదు చేస్తున్నారు.. వీటన్నిటిని ఒకే కోర్టు పరిధిలో విచారించే అందుకు న్యాయపోరాటం కూడా సాగిస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం గా చెప్పారు.


Similar News