భర్త సంపాదన..ప్రియుడి పాలు చేసిన భార్య
ఇల్లును చక్క దిద్దుకోవలసిన ఇల్లాలు పక్క దారి పట్టింది. భర్త రెక్కల కష్టాన్ని ప్రియుడికి దోచి పెడుతూ భర్త మరణానికి కారకురాలైంది. చివరికి కటకట పాలైంది.;
కుటుంబం బాగుండాలని భావించాడు భర్త. కుటుంబాన్ని అన్ని రకాలుగా బాగా చూసుకోవాలనుకున్నాడు. దీని కోసం కష్ట పడాలనుకున్నాడు. అందుకు దుబాయ్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్న ప్రకారమే అతను దుబాయ్ వెళ్లాడు. సంపాదించడం మొదలు పెట్టాడు. కష్టపడి కూడబెట్టిన సొమ్మును భార్యకు పంపించే వాడు. భార్య అన్ని రకాలుగా కుటుంబాన్ని చూసుకుంటూ తక్కిన దానిని జాగ్రత్తగా భద్రపరుస్తుందని కలలు కన్నాడు. కానీ డామిడ్ కథ అడ్డం తిరిగింది. భర్త కన్న కలలన్నీ పగటి కలలుగానే మిగిలి పోయాయి. భార్య తన ఇష్టాను సారం వ్యవహరించసాగింది. అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందంగా భర్త కష్టపడి సంపాదించిన సొమ్మును తన ప్రియుడికి దోచి పెట్టింది. భార్య వ్యవహారంతో జీవితం విరక్తి చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. కాకినాడ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భర్త మరణానికి కారుకులైన భర్యా, ఆమె ప్రయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.