పేకాటకు బానిసైన భార్యపై పోలీసులకు భర్త ఫిర్యాదు

మహిళలు పేకాట జూదం ఆడుతూ పోలీసులకు పట్టబట్టడం ఏపీలో తాజాగా చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-08-07 09:43 GMT

పేకాటకు మగాళ్లు బానిసలు అవుతుంటారు. పేకాట జోలికి పోవద్దని భర్తలను భార్యలు హెచ్చరిస్తుంటారు. కానీ ఆ జూదానికి భానిసలుగా మారిన పురుషులు నగదు, భార్యల నగలను, ఆస్తులను, ఇళ్లను పోగొట్టుకుని చివరికి కుటుంబాన్ని రోడ్డుపైకి పడేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు తరచుగా చూస్తుంటాం. కానీ విశాఖపట్నంలో ఇది రివర్స్‌ అయ్యింది. పురుషులకు బదులుగా మహిళలు పేకాట జూదానికి బానిసలయ్యారు. వారిలో ఓ మహిళ భర్త.. తన భార్య పేకాట జూదానికి బానిసకావడం పట్ల చాలా ఆందోళన చెందేవాడు. పేకాట జూదం మంచిది కాదని, దానికి బానిసగా మారొద్దని, పేకాటను మానుకోవాలని పలు మార్లు భర్యకు ఆ భర్త సూచించారు. కానీ భర్త మాటలను పెడ చెవిన పెట్టిన ఆ భార్య క్రమంగా పేకాటకు బానిసగా మారింది.

ఎన్ని సార్లు చెప్పినా మాట వినక పోవడంతో ఆగ్రహించిన ఆ భర్త కాస్త పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య పేకాటకు బానిసగా మారిందని, నిత్యం పేకాట ఆడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న విశాఖ నాలుగో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక లలితానగర్‌ ప్రాంతంలో ఆమె ఆడుతున్న పేకాట స్థావరం దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళల వద్ద నుంచి రూ. 22వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడొద్దని భర్త చెప్పిన మాటలను పెడచెవిన పెట్టిన మహిళతో పాటు మరో ఐదుగురు మహిళలు కటకటాలపాలయ్యారు. మహిళలు పేకాట జూదం ఆడుతూ పోలీసులకు పట్టబడటం అటు విశాఖలోను, ఇటు ఏపీలోను తాజాగా చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News