నాకు సోదరి లేదు..మంగళగిరి మహిళలే నా అక్కాచెల్లెళ్లు

మంగళగిరి ప్రజలకు రుణపడి ఉంటానని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.;

Update: 2025-08-09 06:39 GMT

తనకు సోదరి లేదని.. సోదరి లేని తనకు మంగళగిరి మహిళలే అక్కాచెల్లెళ్లు అని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. రాఖీపౌర్ణమి సందర్భంగా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌కు తాను ప్రాతినిద్యం వహిస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున వచ్చి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ మహిళలంతా వచ్చి రాఖీలు కట్టి అందించిన ఆశీస్సులు తనకు కొండంత బలాన్నిచ్చాయని పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నంబర్‌ 1గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వెల్లడించారు. త్వరలో మంగళగిరి నియోజక వర్గంలో ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు లోకేష్‌ తెలిపారు.

మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో గతంలో ఎన్నడు లేని విధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 200ల వరకు డెవలప్‌మెంట్‌ యాక్టివిటీస్‌ చేపట్టినట్లు చెప్పారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, విద్యుత్, గ్యాస్‌పైప్‌లైన్ల ఏర్పాటు, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు, స్వర్ణకరుల కోసం జెమ్స్‌ అండ్‌ జ్యూవెలరీ పార్కు ఏర్పాటు వంటి అనేక ముఖ్య కార్యక్రమాలు కూడా తాను చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం మంగళగిరి పరిధిలోని రోడ్లన్నీ డెవలప్‌ చేస్తున్నామని, మహా ప్రస్థానం పేరుతో శ్మశాన వాటికల ఆధునీకరణ్, నిర్మాణాలు, పార్కులను అభివృద్ధి చేయడం వంటి పలు కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా.. తక్కిన నియోజక వర్గాలన్నింటిల్లోకి మంగళగిరి నియోజక వర్గంలో మాత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి స్థాయిలో మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గాన్ని డెవలప్‌ చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.
Tags:    

Similar News