కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటుడు, ఏపీ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పోసాని కృష్ణమురళి మీద కూడా దృష్టి సారించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పోసాని కృష్ణమురళి కూటమి పెద్దలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేషలను తీవ్రంగా దూషించారని, అసభ్యకరంగా దుర్బషలాడారని పోసాని మీద కేసులకు తెరలేపారు. అయితే తన మీద నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు పోసాని ఎత్తుగడలేశారు.
అందులో భాగంగా 2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అపజయం పాలైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని పోసాని డ్రామాలాడారు. జీవితంలో ఇక రాజకీయాల గురించి మాట్లాడను అంటూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోసాని చెప్పడం అందులో భాగమేనది టీడీపీ శ్రేణుల్లో సాగుతోన్న చర్చ. బుధవారం రాత్రి హైదరబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్, లోకేష్, వారి కుటుంబ సభ్యులు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడారని పోసాని మీద కేసులు నమోదు చేసిన పోలీసులు అతనని అరెస్టు చేశారు.
పోసాని మీద రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా పోసాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పోసాని కష్ణమురళి అత్యంత అసభ్యకరంగా దూషించారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఓ ప్రెస్ మీట్‌లో పోసాని కృష్ణమురళి చంద్రబాబుకు వ్యతిరేకంగా, కుట్రపూరితంగా, ఆర్గనైజ్డ్‌గా మార్ఫింగ్, ఫ్యాబ్రికేట్ చేసిన చంద్రబాబు ఫొటోలను ప్రదర్శించారు. చంద్రబాబు మీద అత్యంత అవమానకరమైన రీతిలో చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేశారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గత ఏడాది నవంబరులో కేసు నమోదు చేశారు. ఆర్గనైజ్డ్‌గా నేరానికి పాల్పడటం, వర్గాల మధ్య శత్రుత్వం, విద్వేషాలు రెచ్చగొట్టేలా, విద్వేషాలు పెంచే విధంగా ప్రసంగాలు చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఫోర్జరీ ఆరోపణలు వంటి అభియోగాల మీద బీఎన్‌ఎస్‌లోని 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) వంటి సెక్షన్‌ల కింద పోసాని కృష్ణమురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్ వెనుక విస్తృతమైన నేరపూరితమైన కుట్ర ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడుపైన పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదులు చేసిన మేరకు పోసాని మీద కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు కలమట వెంకట రమణమూర్తి కూడా పోసాని మీద ఫిద్యారు చేశాడు. దీనిపై పాతపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన పోసాని వ్యాఖ్యలపైనా పోలీసులు కేసు నమో చేశారు. మంత్రి నారా లోకేష్‌తో పాటు ఇతర తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్బషలాడారని ఫిర్యాదులు చేశారు.
హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో పోసాని కృష్ణమురిళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపైన, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మీద తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, పరుష పదజాలంతో దూషించారని, దుర్బాషలాడారని కడపలో ఫిర్యాదులు చేశారు. టీడీపీ శ్రేణుల ఫిర్యాదుల మేరకు కడప రిమ్స్ పోలీసు స్టేషన్‌లో పోసాని మీద కేసులు నమోదు చేశారు. ఇక బాపట్ల, మంగళగిరి, అనంతపురం, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరు వంటి పలు ప్రాంతాల్లో కూడా పోసాని మీద టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు పోలీసులు పోసాని మీద కేసులు నమోదు చేశారు. సినీ పరిశ్రమలో కూడా వర్గ విభేదాలు తెచ్చే విధంగా పవన్ కల్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని రెండు రోజుల క్రితం జోగినేని మణి అనే జనసేన నేత కడప జిల్లా ఓబులవారిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చస్త్రశారు. బీఎన్‌ఎస్‌లోని 196,353(2),111, రెడ్‌విత్3(5) వంటి సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.