కర్నూలు వద్ద బస్సు దగ్ధం ఘటన: మృత్యుంజయులు 21 మంది
కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-24 08:51 GMT
కర్నూలు జిల్లా లో శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు దగ్ధం ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. ఘటనా స్థలాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సందర్శించారు. తాజా వివరాలను ఆయన వెల్లడించారు.
"కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఏకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది సురక్షితంగా ఉన్నారు. 11 మృతదేహాలను గుర్తించాం" అని కర్నూలు నుంచి డిఐజి కోయ ప్రవీణ్ చెప్పారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిసి 40 3 మంది ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద బైక్ను ఢీకొనడంతో చలరేగిన నిప్పురవ్వల వల్ల మంటలు వ్యాపించాయి. ఘటన సమాచారం తెలిసిన వెంటనే కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరేళ్లు కమర్ పరిశీలించారు.
కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నటేకూరు వద్ద ఉన్న నాయకులు ఫ్లై ఓవర్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచి మూడు పది గంటల మధ్య ప్రమాదం జరిగినట్లు నిర్ధారించామని డిఐజి కోయ ప్రవీణ్ చెప్పారు.
ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, మరో 20 మందిలో 11 మృతదేహాలను కూడా గుర్తించాం" అని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. మిగతా మృతదేహాల ను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ఇలా ఉండగా ఘటనా స్థలిలోనే సభ పంచనామా నిర్వహించడం ద్వారా బంధువులకు మృతదేహాలు అప్పగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఘటనా స్థలంలోనే ఆయన కూడా మకాం వేశారు. బస్సు దగ్ధం ఘటనలో గాయపడిన బాధితులకు కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.
మృత్యువును జయించారు..
హైదరాబాద్ నుంచి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరిన వారిలో కొందరు అద్దాలు పగలగొట్టి బయటికి దూకారు. వారిలో జయసూర్య, రామిరెడ్డి, అకిరా, వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, రమేష్, సుబ్రహ్మణ్యం ఉన్నారు అని డిఐజి కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. వారందరికీ మెరుగైన చికిత్స అందించే విధంగా అధికారులు పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.
కర్నూలు లో కంట్రోల్ రూం
కర్నూలు నగరానికి సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై అధికారులు స్పందించారు. హృదయ విధానంగా ఉన్న ఘటనా స్థలంలో మృదేహాలను ఒకపక్క గుర్తిస్తూనే, ప్రాణాలతో బయటపడిన వారికి మెరుగైన చికిత్స అందించే దిశగా ఏర్పాట్లు చేశారు. కర్నూలు వద్ద బస్సు దగ్ధమైన ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి వీలుగా జిల్లా అధికారులు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08518 277305
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 91211 101 059.
ఘటన జరిగిన చిన్న టేకూరు వద్ద 91211 0 1 0 6 1
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నైన్ వన్ టు డబల్ వన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్
కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ హెల్ప్ డెస్క్
949460 ౯౮౧౪
90529 51010
నెంబర్లలో బాధితుల కుటుంబీకులకు సమాచారం అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి వెల్లడించారు.